నూతనకల్, జూలై 9: ప్రజలను చైతన్యం చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి సీఐ నరసింహారావు చెప్పారు. మండల పరిధిలోని పెదనెమిలలో ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక అంశాలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజల సహకారం లేకుండా పోలీసు, న్యాయవ్యవస్థ పటిష్టంగా పనిచేయడం సాధ్యం కాదని చెప్పారు. ప్రజలంతా చట్టాన్ని గౌరవిస్తూ అన్యాయాన్ని సహించకుండా ముందుకు వస్తే పోలీస్ శాఖ మేమున్నామంటూ భరోసా ఇస్తుందని వెల్లడించారు. సమాజంలో యువత మాదకద్రవ్యాలు, ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడకుండా చదువులపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు