హుజూర్నగర్టౌన్: పెళ్లి కావటం లేదని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని సీతరాంనగర్ కాలనీలో జరిగింది. ఎస్.ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం సీతరాంగనర్కు చెందిన పొల నరేశ్ (29) పట్టణంలోని ఇందిరా సెంటర్లో బుక్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. వయ స్సు పెరుగుతున్నా పెళ్లి సంబంధాలు రావటం లేదని కొన్ని రోజులుగా బాధ పడుతుండేవాడు.
ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం మట్టపల్లి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి ఖమ్మం వెళ్లి శ్రీనివాస లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి హైద్రాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించాడని మృతుడి అన్న కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.