కోదాడ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని ఎమ్మెస్ విద్యాసంస్థల చైర్మన్, పందిరి నాగిరెడ్డి ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు రాయపూడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెస్ కళాశాల ఆవరణలో దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్ చిత్రనిర్మాత అంకతి అనుసూర్య ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. ఆయన పోరాటం నేటి తరానికి ఆదర్శప్రాయం అన్నారు. ఆయన జీవిత చరిత్రను సినిమా తీయడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో కోదాటి గురవయ్య, బడుగుల సైదులు, చెందా శ్రీనివాస్, రామ నరసయ్య, రాధాకృష్ణ, మజహార్, శ్రీనివాస్, లక్ష్మణ్, అబ్రహం, రామయ్య, పాల్గొన్నారు.