స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు 13 రోజులపాటు ఘనంగా జరిగాయి. ఈ నెల 9 నుంచి 21 వరకు 13 రోజులపాటు జిల్లాలో సంబురాలు జరగ్గా నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముగియనున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని జిల్లా యంత్రాంగం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఏ రోజు ఎలా జరిగిందంటే..
ప్రత్యేక కార్యక్రమాలు..
ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు, తిరిగి 16 నుంచి 21వరకు రెండు విడుతలుగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించారు. 1.92 లక్షల మంది చిత్రాన్ని వీక్షించారు. ప్రతి గ్రామంతోపాటు పట్టణాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో మామిడి తోరణాలు కట్టి విద్యుద్దీపాలు అలంకరించారు.సోమవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వేడుకలు ముగియనున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు.