కోదాడ రూరల్, జూన్ 21 : సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని ఎర్రవరం, రామలక్ష్మైపురం, తొరగ్రాయి, గణపవరం గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, పశు వైద్యశాలలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పల్లెలు దేశానికి పట్టగొమ్మలన్న నానుడిని నమ్మి సీఎం కేసీఆర్ పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే వివాహ దినోత్సం సందర్భంగా అభిమానులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన కేక్‌లను కట్‌చేశారు. ఎంపీపీ చింతా కవితారెడ్డి, జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, వైస్ ఎంపీపీ మల్లె రాణి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శి కాసాని వెంకటేశ్వర్లు, శంకర్‌శెట్టి కోటేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు బాలెబోయిన వేలాద్రి, మండల కో ఆఫ్షన్ సభ్యుడు ఉద్దండు, సర్పంచులు వీరెపల్లి సుబ్బారావు, దొంగల లక్ష్మీనారాయణ, పొట్ట విజయ్‌కిరణ్, ముత్తవరపు వరదారావు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.