శాలిగౌరారం, మార్చి 29: పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. తాసీల్దార్ కార్యాలయంలో 51మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. మండల కేంద్రంలో 700 మీటర్ల దూరం ఎఫ్డీఆర్ నిధులు రూ1.50 లక్షలతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే బీజేపీ పాలనలో దేశ అభివృద్ధ్ది తిరోగమనంలో ఉందని విమర్శించారు.
రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కట్టా లక్ష్మీవెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కందుల అనిత, గుజిలాల్ శేఖర్‌బాబు, తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నరేందర్, డీఈ బేగ్, ఏఈ సంతోష్, సర్పంచ్ బట్ట హరిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, చాడ హతీశ్రెడ్డి, మామిడి సర్వయ్య, చాడ సురేశ్‌రెడ్డి, గంట శంకర్, చంద్రమౌళిగౌడ్, అక్కెనపెల్లి శ్రీరాములు, గుండ్లపెల్లి శంకరయ్య ఉన్నారు.
ఎమ్మెల్యేకు ఫీల్డ్ అసిస్టెంట్ల సన్మానం
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామ ని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ను ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎర్ర బుచ్చయ్య ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో కృష్ణ, ఉపేందర్, సైదులు, నీరజ, సుజాత ఉన్నారు.