
రైతులను సంఘటితం చేసే రైతు వేదికలను ఆధునిక కర్షక దేవాలయాలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడ నియోజకవర్గవ్యాప్తంగా రైతు వేదికలు, పట్టణంలో భూసార పరీక్ష కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రైతు సభలో మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగం రూపురేఖలను మార్చారన్నారు. రైతు వేదికల నిర్మాణాల ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.