Modugu Puvvu | మోదుగు పువ్వు.. గ్రామాల్లో దీని గురించి తెలియని వారుండరు. ఔషధ గుణాలున్న ఈ పువ్వును ప్రత్యేకించి హోలీ పండుగ సమయంలో ఎక్కువగా వినియోగించేవారని తెలిసిందే. అయితే క్రమంగా సహజసిద్దమైన రంగుల వాడకం తగ్గించి.. రసాయన రంగుల వాడకం పెరిగిపోవడంతో హోలీ పండుగకు మోదుగు పూల వినియోగం తగ్గుతూ వస్తోంది.
ఇదిలా ఉంటే వచ్చి పొయ్యే బాటసారులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఓ మోదుగు చెట్టు విరబూసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. విరాబూసిన కుసుమాలతో గ్రామీణ ప్రాంతానికి వన్నె తెస్తున్న ఈ దృశ్యం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం లోని బండమీది చందుపట్ల శివారులో మిషన్ భగీరధ ప్లాంట్ ఎదురుగ కనువిందు చేస్తూ చూపరులను కట్టిపడే స్తుంది.
ఎన్నో ఔషద గుణాలున్న మోదుగు పూలకు ఆదరణ తగ్గినా.. నాటి తరం వాళ్ళు మోదుగు పువ్వులను చూసినప్పుడు తీపి గుర్తుగా కొన్ని పువ్వులను వెంట తెచ్చుకుంటున్నారు.