MLA Jagadish Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్ మండాది గోవర్ధన్ పిల్లలను ఆశీర్వదించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల NS (నిమ్మల శ్రీనివాస్ గౌడ్) ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి సునీత సమేతంగా హాజరయ్యారు.
నమస్తే తెలంగాణ రిపోర్టర్ గోవర్ధన్ – శైలజ దంపతుల కూతురు సాద్విత, కుమారుడు జుహిత్ల పట్టు వస్త్రాలంకరణ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే, ఆయన భార్య ఆ చిన్నారులను ఆశీర్వదించారు. తమ పిల్లల పట్టు వస్త్రాలకంరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీ సమేతంగా రావడంతో గోవర్ధన్ – శైలజ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
పట్టు వస్త్రాలంకరణ వేడుకలో ఎమ్మెల్యే దంపతులు