మఠంపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని ఇక బీజేపీ ప్రభుత్వానికి చీకటి రోజులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వర్దాపురం గ్రామంలో సీపీఐ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీలకు పోడు భూముల హక్కులు కల్పించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన చట్టాలను, విద్యుత్ సంస్కరణ చట్టాలను, ఇందన ధరల పెంపు, కార్మిక చట్టాల సవరణలను వెనక్కి తీసుకోవాలన్నారు. సీపీఐ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థల కోసమే పని చేస్తున్నదన్నారు.
అమరారపు పున్నయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు దొడ్డా నారాయణరావు, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, గన్నా చంద్రశేఖర్, యల్లావుల రాములు, దూళిపాళ్ల ధనుంజయ నాయుడు, మండవ వెంకటేశ్వర్లు, పాలకూరి బాబు, పోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.