సూర్యాపేట: సూర్యాపేటలోని (Suryapet) ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ (Robbery) జరిగింది. దుండగులు పెద్దమొత్తంలో నగలు, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని సాయి సంతోషి నగల దుకాణం వెనుక నుంచి గ్యాస్ కట్టర్తో షట్టర్ తొలగించి గుర్తుతెలియని వ్యక్తులు.. లోపలికి ప్రవేశించారు.
షాపులో ఉన్న 18 కిలోల బంగారు ఆభరణాలు, రూ.22 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు.