సూర్యాపేట: పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) అలసత్వంతో మరో సర్కారు బడికి తాళం పడింది. మూడేండ్లుగా కిరాయి కట్టడం లేదంటూ భవన యజనమాని స్కూల్‌కు తాళం వేసిన ఘటన సూర్యాపేటలోని (Suryapet) తిలక్ నగర్లో చోటుచేసుకున్నది.
మూడేండ్లుగా కిరాయి చెల్లించడం లేదని తిలక్ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు భవన యజమాని తాళం వేశారు. దీంతో సోమవారం ఉదయం స్కూల్‌కు విద్యార్థులు బయటే వేచిఉన్నారు. కాగా, మూడేళ్ల కిరాయి ఇవ్వాల్సింది నిజమేనని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల కిరాయి మంజూరు అయ్యిందని వెల్లడించారు. ప్రస్తుతానికి పిల్లలను హైస్కూల్‌కు షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు.
