హుజూర్నగర్: నూతనంగా ఎంపికైన గ్రామ, పట్టణ కమిటీలు టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుజూర్నగర్ మున్సిపాలి టీ, మండల టీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు ఎంపిక చేసిన వార్డు కమిటీల జాబితాను ఎమ్మెల్యేకు అంద జేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపికైన కమిటీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు.
అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు చేరేలా చూడాల్సిన భాధ్యత కమిటీలపై ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథరెడ్డి, వైస్‌చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, గెల్లి రవి, దొంతగాని శ్రీనివాస్, చావా వీరభద్రరావు, అబ్దుల్ నబీ, ముడెం గోపిరెడ్డి, చీకూరి రాజా రావు, కస్తాల రామయ్య, బెల్లంకొండ అమర్, ఎడ్ల విజయ్ తదితరులు ఉన్నారు.