చింతలపాలెం: ఎమ్మార్పీఎస్ బలోపేతానికి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతలపాలెం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కనితి ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. అనంతరం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కనితి ప్రశాంత్ మాదిగ, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు చింత్రియాల ప్రేమయ్య మాదిగ ఆధ్వర్యంలో చింతలపాలెం ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడిగా చింతిరియాల గోపి మాదిగ, ఉపాధ్యక్షుడిగా చింతిరియాల కొండలు మాదిగ, ప్రధాన కార్యదర్శిగా నందిగామ విజయ్ మాదిగ, అధికార ప్రతినిధిగా కందుకూరి మణిరత్నం మాదిగ, కార్యదర్శిగా మాతంగి రమేష్ మాదిగ, సహాయ కార్యదర్శు నూకపొంగు గోపి మాదిగ, గౌరవ సలహాదారులుగా చింత్రియాల శ్యాము మాదిగ, చింత్రియాల శ్రీను మాదిగను ఎన్నుకొని నియామాక పత్రాలు అందించారు.
అనంతరం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కనితి ప్రశాంత్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ కమిటీలు నియమిస్తున్నట్లు తెలిపారు. గద్దెలు లేని చోట గద్దెలను ఏర్పాటు చేసుకోవాలని తెలుపుతూ జులై 7న జరిగే 31వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మాదిగ వాడలలో పండగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.