సూర్యాపేట : రాష్ట్ర కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వం నడపడంపై అవగాహన , బాధ్యత ఉన్నట్టు కనిపించడం లేదని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి (Jagadishwar Reddy) ఆరోపించారు. మంత్రులు జల్సాలకే పరిమితమై రాష్ట్ర అభివృద్ధిని మరిచారని మండిపడ్డారు. సూర్యాపేటలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ జీవధార కాళేశ్వరం (Kaleshwaram) ప్రయోజనాలు పొందడం లేదని దుయ్యబట్టారు. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందని ఆందోళన వ్యకతం చేశారు. వరద పోయాక హడావుడి చేస్తే ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హెలికాప్టర్ల (Helicopters) లో విహార యాత్రలు మాని ప్రొజెక్టుల పర్యటనలు చేపట్టి్ రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సబ్ కమిటీల ఏర్పాటు అనాలోచిత నిర్ణయం..
ప్రాజెక్టుల్లో నీళ్ల నిల్వల పై క్యాబినెట్ సబ్‌కమిటీ వేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇలాంటి పని కోసం సబ్‌కమిటీ( Sub Committee ) ఎక్కడా లేదని వివరించారు. రేషన్ కార్డుల (Ration Cards) అర్హుల నిర్ణయానికి సబ్ కమిటీ అనాలోచిత నిర్ణయమన్నారు. కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి పంపింగ్ చేసి సాగు నీరు అందించాలని, శ్రీరాంసాగర్ ఫేస్ 2కు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల యాసంగి లో పొలాలు ఎండినట్టు, ఖరీఫ్‌లో ఎండే పరిస్థితి కనపడుతుందన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తిపోతను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల జీవో 33 తో నష్టం జరుగుతుందని వెల్లడించారు. దీనిపై న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేశారు.