సూర్యాపేట : నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నాడని, భవిష్యత్తులో దాడులకు ప్రతి దాడులు తప్పవని రాష్ట్ర గోట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటి గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు ఆల్దాస్ సతీష్ గౌడ్ పై కాంగ్రెస్ గుండాలు హత్యాయత్నానికి పాల్పడగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్వీ దవాఖానలో చికిత్స పొందుతున్న సతీష్ గౌడ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆల్ దాస్ సతీష్ గౌడ్ పై కాంగ్రెస్ గుండాలు అత్యాయత్నానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. గత 27 నెలలుగా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ దాడులు చేస్తూ జైల్లో పెడుతూ కాంగ్రెస్ తప్పులను ప్రశ్నిస్తే హత్యాయత్నం కు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒడ్లు కొనమని అడగడం కూడా తప్పేనని వడ్లు కొనమని అడిగితే నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరేశం దాడులు చేయించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే వీరేశం అనుభవిస్తున్న పదవి కేసీఆర్ భిక్షతో వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. వీరేశం మీ స్థాయి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డి లను విమర్శించే స్థాయి కాదని గుర్తెరగాలన్నారు.
పోలీసులు హత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేసి దాడికి పాల్పడిన నిందితులు అఖిల్, శివ, రమేష్ లను వెంటనే రిమాండ్ చేయాలన్నారు. ఈ విషయమై తాము జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ మనవహక్కుల కమిషన్ కలవనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్ర బోయిన సైదులు, పరశురాములు, యోగి, సాయి చీకటిగూడెం గ్రామ బీఆర్ఎస్ నాయకులు నల్లపు లింగయ్య, నల్లపు నాగేశ్వర్ రావు, కోడి వెంకటేశ్వర్ రావు, సాదే నవీన్, కోట సంపత్ రావు, బుర్రీ నరేష్, బొజ్జ రామయ్య, వడ్డే జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.