సూర్యాపేట, నవంబర్ 10 : పేద, మద్య తరగతి ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక భరోసా సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోహెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేయడం అబినందనీయమన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని కోహెన్స్ లైఫ్ సైన్సెస్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎజీఎం హెచ్ఆర్ పైలా శంకర్, అడ్మిన్ మేనేజర్ దుస్సా సైదులు, ఇహెచ్ఎస్ రమణారెడ్డి, పి.వి.రమణ, ఎం.శ్రీనివాసరావులతో పాటు కంపెనీ ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.