మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 14, 2020 , 03:45:20

నృసింహుడి ఆలయ ధర్మకర్తగా విజయ్‌కుమార్‌

నృసింహుడి ఆలయ ధర్మకర్తగా విజయ్‌కుమార్‌

మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తగా చెన్నూరు విజయ్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ధర్మకర్తగా విధులు నిర్వహించిన చెన్నూరి మట్టపల్లిరావు పదవీకాలం ముగియడంతో విజయ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.మహేందర్‌కుమార్‌, ఈఓ ఎస్‌.నవీన్‌, చెన్నూరి మట్టపల్లిరావు, మిర్యాలగూడెం డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ.రమేశ్‌, కోటిరెడ్డి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

హుండీ ఆదాయం లెక్కింపు..

మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుని హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్‌, ఈఓ ఎస్‌.నవీన్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 29, 2020 నుంచి ఆగస్టు 13, 2020 వరకు ఆలయ హుండీల ద్వారా రూ.10,23,636, అన్నదానం హుండీల ద్వారా రూ.35,160 మొత్తం కలిపి రూ.10,58,796 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.  logo