ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 07, 2020 , 02:40:56

ముగిసిన విద్యుత్‌ ఉద్యోగుల క్రీడా పోటీలు

ముగిసిన విద్యుత్‌ ఉద్యోగుల క్రీడా పోటీలు

నల్లగొండ స్పోర్ట్స్‌ : జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ అవుట్‌డోర్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ నల్లగొండ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి జరుగుతున్న ట్రాన్స్‌కో, డిస్కమ్‌ ఇంటర్‌ సర్కిల్‌ హాకీ, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు గురువా రం ముగిశాయి. టీఎస్‌ఎస్‌డీసీఎల్‌ కమర్షిల్‌ డైరక్టర్‌ కె.రాములు, సీజీఎం పాండ్యానాయక్‌ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రీడాపోటీలు విద్యుత్‌ ఉద్యోగులలో నూతనోత్సాహాన్ని నింపాయన్నారు. 


హోరాహోరీగా ఫైనల్‌

గురువారం హోరాహోరీగా జరిగిన హాకీ ఫైనల్‌లో కరీంనగర్‌, వరంగల్‌ జట్లు పొటీ పడగా కరీంనగర్‌ విజయం సాధించగా వరంగల్‌ రన్నరప్‌గా నిలిచింది. నల్లగొండ, నిజమాబాద్‌ జట్ల మధ్య జరిగిన మరో మ్యా చ్‌లో నల్లగొండ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో విజేతలకు బహుమలు అందించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో నల్లగొండ సర్కిల్‌ ఎస్‌ఈ కృష్ణయ్య, సూర్యాపేట సర్కిల్‌ ఎస్‌ఈ పాల్‌రాజ్‌, యాదాద్రిభువనగిరి సర్కిల్‌ ఎస్‌ఈ బాలస్వామి, డీఎస్‌డీవో మక్బూల్‌ అహ్మద్‌, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ట్రాన్స్‌కో డిస్కామ్స్‌ స్పోర్ట్స్‌ సెక్రటరీ తిరుగుడు శ్రీనివాస్‌, స్పోర్ట్స్‌అండ్‌ గేమ్స్‌ సెక్రటరీ కరెంట్‌రావు, వెంకటయ్య, రమేష్‌, రమేష్‌రెడ్డి, రవీందర్‌, శ్రీనివాస్‌, పాండు పాల్గొన్నారు.


logo