ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత ముల్క్‌రాజ్ ఆనంద్ అనగానే గుర్తుకువచ్చే పుస్తకం ‘ది అన్‌టచబుల్’. ఇందులో బాఖా అనే సఫాయి కార్మికుడి ఒక్కరోజు జీవితాన్ని చిత్రించారు. కథా కాలం 1930వ దశకం. అది గాంధీజీ దళితుల ఉద్ధరణకు కృషి చేస్తున్న సమయం. ఇక కథా వేదిక ఉత్తర భారతదేశంలోని కాల్పనిక సైనిక శిబిరం బులాషా. సఫాయి కార్మిక కుటుంబానికి చెందిన బాఖా అనే పద్దెనిమిదేండ్ల యువకుడు ఇందులో కథానాయకుడు.
అతను ఓ ఉదయం వేళ మరుగుదొడ్లు కడిగే పనితో రోజు ప్రారంభిస్తాడు. అక్కడినుంచి తాగే నీళ్లు, తినే తిండి కోసం బాఖా అతని కుటుంబం ఎన్ని పాట్లు పడాల్సి వస్తుందో చదువుతుంటే గుండె చెమ్మగిల్లుతుంది. అగ్రవర్ణాల ఔద్ధత్యానికి దళితులు ఎన్ని ఇక్కట్లు పడ్డారో బాఖా, అతని తండ్రి లాఖా, చెల్లి సోహిని పాత్రల ద్వారా ముల్క్‌రాజ్ ఆనంద్ కండ్లకుకట్టారు. స్వాతంత్య్రం రాకముందు, ఎలాంటి రాజ్యాంగ హక్కులు లేకముందు దళితులు తాగునీటికి, వీధుల్లో నడవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈ నవల చదివితే అవగతమవుతుంది.
అంతేకాదు భారతీయ సమాజంలో దళితులు ఎదుర్కొన్న మరో సమస్య దేవాలయ ప్రవేశం కూడా ఇందులో చర్చకు వచ్చింది. చివరగా ఓ క్రికెట్ గ్రౌండ్లో స్వాతంత్య్రోద్యమ నాయకుడు గాంధీజీ ప్రసంగంతో బాఖా స్ఫూర్తి పొందడంతో నవల ముగుస్తుంది. అయితే, ఇది బాఖా ఒక్కరోజు జీవిత చిత్రణే కాదు… వారి కుటుంబాల తరతరాల వేదనకు అక్షర రూపం. తొంభై ఏండ్ల కింద ముల్క్‌రాజ్ ఆనంద్ రాసిన ఈ నవలను చింతపట్ల సుదర్శన్ ‘అంటరానివాడు’ పేరుతో అనువదించారు. భారతీయ సమాజంలో ఓ ప్రధాన వర్గం అనాదిగా ఎదుర్కొన్న సామాజిక వివక్షను ఈ పుస్తకం పాఠకుల కండ్ల ముందు నిలుపుతుంది. సాటి మనిషిని మనిషిలా చూడాలని సందేశం ఇస్తుంది.
మూలం: ముల్క్‌రాజ్ ఆనంద్
అనువాదం: చింతపట్ల సుదర్శన్
పేజీలు: 134; ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98487 87284
అనువాదం: చింతపట్ల సుదర్శన్
పేజీలు: 237;
ధర: రూ. 250
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98487 87284
రచన: రేడియమ్
పేజీలు: 146;
ధర: రూ. 250
ప్రతులకు: 92915 27757
రచన: ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు: 248;
ధర: రూ. 150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413