Naya Mall | సరికొత్తగా బ్రెస్లేట్లు.. గాయత్రీ మంత్రం, ఖురాన్ వాక్యాలతో డిజైన్లు
నమ్మకమైన కానుక!
ప్రత్యేక సందర్భాల్లో ఇష్టమైన వ్యక్తులకు వైవిధ్యమైన కానుక ఇవ్వాలని అనుకుంటాం. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి నమ్మకాలనూ దృష్టిలో ఉంచుకోవడం మంచిది. అలాంటి వారికోసం హైదరాబాద్‌కు చెందిన పల్లవి ఫోలీ సరికొత్త బ్రేస్లెట్లు, పెండెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా మగవారికోసం రూపొందించే ఈ రక్షలపై గాయత్రీ మంత్రం, ఖురాన్ వాక్యాలు, బైబిల్ సూక్తులు ఉంటాయి. బంగారం, వెండి పలకలపై వీటిని రూపొందించారు. ప్రారంభ ధర. రూ.10,000/-

క్షణాల్లో కమ్మని కాఫీ!
వేడివేడిగా ఓ కప్పు కాఫీ పడితే ఎంతటి ఒత్తిడి అయినా హుష్‌కాకి. పొద్దున్నే ఓ కప్పు, దినపత్రిక తిరగేస్తూ ఓ కప్పు, ఆత్మీయులతో ఫోన్లో మాట్లాడుతూ ఓ కప్పు, స్నానానికి ముందూ తర్వాతా ఓ కప్పు.. తీర్థం పడాల్సిందే. అలాంటి అచ్చమైన కాఫీ ప్రియులకోసం కాఫీజా అనే సంస్థ ‘ది ఫినెరో నెక్ట్స్’ అనే ఓ సరికొత్త మెషీన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యంత్రంతో మనకు కావలసిన ఫ్లేవర్‌తో కాఫీ చేసుకోవచ్చు. పాలతో లేదా క్రీమ్‌తో, పాలు లేకుండానూ.. ఎలా కావాలంటే అలా కమ్మని కాఫీ సిద్ధమైపోతుంది. నచ్చిన ఫ్లేవర్ కాఫీ బిళ్లను ఈ మెషీన్లో వేసి, స్విచ్ ఆన్ చేస్తే చాలు.. పొగలుకక్కే వేడివేడి కాఫీతో కప్పు నిండుతుంది. ఈ యంత్రం ఆన్లైన్ ధర. రూ.12,499/- మాత్రమే.

స్మార్ట్ క్లీనర్!
ఇల్లాలికి ఇంటిని శుభ్రం చేసుకోవడంతోనే సగం సమయం ఖర్చయిపోతుంది. ఎన్నిసార్లు దులిపినా మళ్లీ వచ్చి చేరుతుంది దుర్మార్గపు దుమ్ము. పిల్లలు ఎక్కి దూకే సోఫాలు, మంచాల సంగతైతే చెప్పక్కర్లేదు. ఇదంతా కనిపించే దుమ్ము! మరి కంటికి కనిపించని సూక్ష్మమైన ధూళి సంగతేంటి? ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు వచ్చిందే ‘డైసన్ డి12 డిటెక్ట్ స్లిమ్’. వాక్యూమ్ క్లీనింగ్‌లో సరికొత్త హంగులతో దీన్ని రూపొందించారు. గ్రీన్ లేజర్‌తో అనుసంధానమైన ఈ క్లీనర్ పనితీరును ఎల్ఈడీ స్క్రీన్‌పై చూడొచ్చు. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే గంటపాటు పని చేస్తుంది. గోడలు, ఫ్లోరింగ్‌తోపాటు ఫర్నిచర్‌ను కూడా చక్కగా శుభ్రం చేస్తుంది. ఈ స్మార్ట్ క్లీనర్ ఆన్లైన్ ధర. రూ.58,900/-.
![]()
పెన్ను కొత్తగా..
ఫౌంటెన్ పెన్.. ఓ తరానికి తీయని జ్ఞాపకం. ఆ ఉద్వేగాన్ని పదిలం చేసేందుకే ప్రసిద్ధ పెన్నుల తయారీ సంస్థ విలియమ్పెన్ సరికొత్త కలాలను అందుబాటులోకి తెచ్చింది. ఎంతకాలమైనా చెక్కు చెదరకుండా కాపర్, నికెల్ వంటి దృఢమైన లోహాలతో వీటిని తయారు చేస్తారు. నునుపైన లోహంతో ఫినిషింగ్ ఇస్తారు. ఫౌంటెన్ పెన్నులతోపాటు రోలర్‌బాల్, బాల్‌పాయింట్ పెన్నులు కూడా అందుబాటులో ఉన్నాయి. ధరలు రూ.4,800/- నుంచీ.
Read More :
Naya Mall | అనారోగ్యంగా ఉందా? ఈ గ్యాడ్జెట్‌తో ఇంట్లోనే బాడీ స్కానింగ్ చేసుకోవచ్చు
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఇంట్లో ఉంటే మీ మాటలు బయటకు వినిపించవు..
మీ పెంపుడు శునకాలకు ఈ స్మార్ట్ బెల్ట్ వేయండి.. రిజల్ట్ చూడండి..
Yezdi Bikes | అప్పట్లో కుర్రకారు మతులు పోగొట్టిన యెజ్డీ జావా బైకులు మళ్లీ వచ్చేస్తున్నాయ్..
Naya Mall | మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వీటి గురించి తెలుసా !
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

