అలా అని ఏమీలేదు. అన్ని జీవులకు జబ్బులు ఉన్నట్లే.. అన్ని దిశల నిర్మాణాలకూ అవకతవకలు జరిగే అవకాశం ఉంది. దుష్ఫలితాలు కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఏ దిశ అయినా.. జాగ్రత్తలతో నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒక పేరుగాంచిన దిశగా ఈశాన్యం బ్లాకు ఉన్నా.. దాని సమస్యలు దానివే! మంత్రి అయినంత మాత్రాన నిత్య సుఖాలు అనుభవిస్తాడు అనుకోవద్దు. నిత్య సంఘర్షణలు కూడా ఉంటాయి. ఏదైనా చక్కగా మెయిన్టేన్ చేయడంలోనే ఉంటుంది.. వైభవం. ఈశాన్యం భాగంలో తూర్పు హద్దును అంటుకొని కారు షెడ్డు, పందిరి, ఉప గదులు కడితే.. ఆ ఇంటిని వదిలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఈశాన్యం స్థలానికి ఉండే ఉత్తరం వీధి తూర్పునకు నేరుగా వెళ్లకపోయినా.. తూర్పు రోడ్డు నేరుగా మన నివాసం దాటి ఉత్తరానికి సాగకపోయినా.. పేరుకు అది ఈశాన్యం బ్లాకు అనిపించినా సంపూర్ణ ఫలితాలు అందవు. అలా ఎన్నో లోపాలు కూడా ఉండవచ్చు.
ఇల్లు పడమర ముఖంగా కట్టినప్పుడు ఉత్తరం భాగం మీకు చాలా ప్రధానంగా ఉంటుంది. అంటే, పడమర – వాయవ్యంలో రాకపోకలకు సంబంధించిన గేటు పెట్టాల్సి వస్తుంది. తద్వారా, వాయవ్య భాగంలో స్థలం ఉన్నప్పటికీ మీరు అక్కడ స్టాఫ్ కోసం గదులు కట్టడం మంచిదికాదు. తూర్పు వైపు ఖాళీని కాస్తా ఎక్కువగా విదిలి, తూర్పు – ఆగ్నేయంలో స్టాఫ్ గదులు కట్టుకోండి. ఎత్తుగా అంటున్నారంటే.. గ్రౌండ్, ఫస్ట్‌ఫ్లోర్ కూడా వేసుకోవాలనేది మీ ఆలోచన కావచ్చు. అలా అయితే, మీరు ఉండే ప్రధాన గృహం.. తప్పకుండా గ్రౌండ్ ఫ్లోర్తోపాటుగా పైనకూడా మరో ఫ్లోర్ వేసి ఉండాలి. అప్పుడే స్టాఫ్ గదికి పైన ఒక అంతస్తును పెంచుకోవచ్చు.
తప్పక అవసరం ప్రతి క్షేత్రంలో. అది వ్యవసాయ స్థలం కావచ్చు.. పరిశ్రమ కావచ్చు. క్షేత్రం హద్దులను కలుపుతూ ఒక ఇన్నర్ రింగ్‌రోడ్డు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆ రోడ్డు మరీ విశాలంగా వేయాల్సిన అవసరం లేదు. పది అడుగుల నుంచి ఎనిమిది అడుగుల వెడల్పుతో ఉన్నా చాలు. అది దేనికి పోటీగా ఉండదు. పైగా అన్ని మూలలనూ కలుపుతూ అనుకూలమై ఉంటుంది. ఇక ప్రధానంగా ఒక ప్లస్ ఆకారంతో రోడ్డు వేసుకుంటే కూడా అది సంపూర్ణ ప్రయోజనకారిగా నిలువగలదు. చాలామంది రోడ్డుకు స్థలం పోతుందని వేయకుండా అవస్థలు పడుతుంటారు. పంటలు చేతికొచ్చినప్పుడు కోసి ఏ మూలలో రాశి పోసినా.. వ్యాన్లలో లోడింగ్ చేసుకోవడానికి చుట్టూ రోడ్డు ఉండటం ఎంతో మంచిది.
నేటి ఆధునిక వ్యవస్థలో పరిశ్రమలు ఎంతో ప్రాధాన్యం కలవి. తప్పక వాటికి శాస్త్ర ప్రాధాన్యత ఉంటుంది. దిశ – దశ నుంచి ఏదీ అతీతం కాదు. అమరిక అనేది శాస్త్రబద్ధంగా ఉంటే.. అది ఇచ్చే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. నేల విడిచి సాధన చేయలేము కదా! దేశవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు ఉంటాయని మనకు తెలుసు కానీ, ఎన్నో నడవక మూతబడి ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని మూతపడే దిశలో కూడా ఉన్నాయి. మరికొన్ని కాకతాళీయంగా ప్రకృతికి అనుకూలంగా కుదిరి.. మహాద్భుతంగా వెలుగొందుతున్నాయి. కారణం.. ఆయా పరిశ్రమలు అమరిన విధానం అనేది మనం అవగాహన చేసుకోవాలి. మీరు చెప్పినట్టు ఇండస్ట్రీ అంటే.. చాలా పెద్ద వ్యవస్థ. కానీ, అది గొప్పగా అభివృద్ధిలో నడవడం – నడపడం కూడా అవసరమే కదా! కాబట్టి పరిశ్రమలకు వాస్తు తప్పక వర్తిస్తుంది.