ప్రకృతిలో అణువణువూ అద్భుతమే! ఆ అద్భుతాలు తారసపడ్డప్పుడు స్పందించే హృదయం ఉప్పొంగి పరవశిస్తుంది. ఆ వ్యక్తి భావకవి అయితే.. కవితలు వెల్లువెత్తుతాయి. కథకుడు అయితే.. అందమైన కథ పురుడు పోసుకుంటుంది. రచయిత అయితే.. ఓ కావ్యమే జన్మెత్తుతుంది. ఒక్కో రచయిత మనసూ.. ఒక్కో విషయంపై ప్రతిస్పందిస్తుంటుంది.‘సారంగి’ నవల.. రచయిత్రి చుండూరు సీత హృదయాంతరాల్లో పెల్లుబుకిన ఆవేశానికి అక్షర రూపం! రామప్ప గుడి అందాలు చూసిన తర్వాత తనలో నాటుకుపోయిన భావాలను ఊహల పల్లకీలో ఊరేగించారామె! మనిషి సృజనలోంచి పుట్టుకొచ్చిన ఏ శిల్పాలు.. కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు.
కానీ, రామప్ప కోవెలలో కొలువుదీరిన మదనిక రూపాలు బుర్రను తొలుస్తాయి. ఏ అప్సరకాంతలో శాపవశాన ఈ గుడి కుడ్యాలపై శిల్పాలుగా వెలిశాయన్న భావన కలుగుతుంది. అలాంటి ఓ అప్సరలాంటి శిల్పమే.. రచయిత్రి సీత మనసును తట్టిలేపిందేమో! అందుకే ఈ గుడి నేపథ్యంగా ఓ అందమైన పాత్రను సృష్టించి ‘సారంగి’ నవలకు శ్రీకారం చుట్టారేమో! రామప్ప గుడి చుట్టూ అల్లుకున్న కథల నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఈ కావ్యాన్ని రచించారామె. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘సారంగి’ రచయిత్రి ఊహా తరంగిణి. సాహసి, సౌందర్యవతి, త్యాగమయి అయిన సారంగిని భూమికగా నాటి రాజుల పాలనని, ఆనాటి ప్రజల జీవన విధానాలను కళ్లకు కట్టారు. సృజనాత్మకతకు స్వేచ్ఛ తోడైతే ఎంత ముచ్చటగా ఉంటుందో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది.
పేజీలు: 160, వెల: రూ.150
ప్రతులకు: సీహెచ్ భార్గవ
విల్లా నెలం: 117/సీ
బోరంపేట్, హైదరాబాద్- 500043 పాలపిట్ట బుక్స్- 98487 87284
రచన: నాగవరం బాల్‌రాం
పేజీలు: 159;
ధర: రూ. 150
ప్రతులకు:
ఫోన్: 94406 78603 ,94911 94689
రచన: నామిని సుబ్రమణ్యం నాయుడు
పేజీలు: 80;
ధర: రూ. 100
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్
రచన: డా. కె. మీరాబాయి
పేజీలు: 274;
ధర: రూ. 200
ప్రతులకు:
ఫోన్: 94908 83299