పల్లె పల్లెకూ రహదారులు
పరిపాలన వికేంద్రీకరణ జరిగి, జిల్లాలు చేరువకావడం, కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావడంతో రవాణ సదుపాయాలు మెరుగయ్యాయి. ప్రతీ గ్రామ పంచాయతీని మండల కేంద్రంతో కలుపుతూ రోడ్ల నిర్మాణాలు జరిగాయి.
పరిపాలన వికేంద్రీకరణ జరిగి, జిల్లాలు చేరువకావడం, కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావడంతో రవాణ సదుపాయాలు మెరుగయ్యాయి. ప్రతీ గ్రామ పంచాయతీని మండల కేంద్రంతో కలుపుతూ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. అలాగే ప్రతి మండలాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రానికి అనుసంధానం చేసేలా, జిల్లా కేంద్రంతో కలిపేలా రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగింది. దుమ్ము రేగే తొవ్వలు తారురోడ్డుగా మారడంతో ఊళ్లకు కొత్త కళ వచ్చినట్టయింది. రోడ్ల పరిస్థితి మారడంతో దాదాపు ప్రతి ఊరికీ పల్లె వెలుగు బస్సొచ్చింది. ప్రతి పౌరుడినీ గమ్యానికి చేర్చేలా ఆర్టీసీ తన గమనాన్ని మార్చుకుంది. రాష్ట్ర రహదారులు మొదలుకొని అన్ని శాఖల పరిధిలోని రోడ్ల విస్తీర్ణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
రోడ్ల విస్తీర్ణం, నాణ్యత పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. పదేండ్ల కాలంలో ప్రైవేట్ వాహనాలు, లైట్ మోటర్ వెహికిల్స్, టూ వీలర్స్ కొనుగోళ్లు మూడు రెట్లు పెరిగిపోయింది.

Road 1
జగిత్యాల-నిర్మల్ జిల్లాలకు అటు ఇటు సరిహద్దుగా గోదావరి నది పారుతూ ఉంటుంది. నదికి దక్షిణంలో జగిత్యాల జిల్లా పరిధిలో ఉంటే, ఉత్తరాన నిర్మల్ జిల్లా ఉంటుంది. గోదావరి నదిపై కిలోమీటర్ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. ఈ వంతెన నిర్మాణం జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య దూరం దాదాపు 80 కిలోమీటర్లు తగ్గుతుంది. ఒక్క వంతెన నిర్మాణంతో ఇంత సౌలత్ కలుగుతుందని తెలిసినా.. నాటి పాలకులు పట్టించుకోలేదు. కేసీఆర్ హయాంలోనే ప్రజల డిమాండ్ నెరవేరింది. రూ.70 కోట్లతో వారధి నిర్మించడంతో ఉభయ జిల్లాలకూ అదనపు ప్రయోజనం చేకూరింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దగ్గరి తొవ్వలో హైదరాబాద్ చేరేందుకు మార్గం సుగమమైంది.
ఈ అభివృద్ధి ఒక్క జగిత్యాలకే పరిమితం కాలేదు. 33 జిల్లాల్లోనూ మా దారి రహదారి అనుకునే పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు మచ్చుకైనా అభివృద్ధి ఆనవాళ్లు లేని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నారాయణ పేట లాంటి మారుమూల జిల్లాల్లో సైతం రోడ్లు విస్తరించాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఎనిమిదేండ్ల కాలంలో 13,455 కిలోమీటర్ల పొడవున రోడ్డు సౌకర్యం పెరిగింది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

