‘పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో’ అంటారు దాశరథి కృష్ణమాచార్యులు ‘ఆ చల్లని సముద్రగర్భం…’ గీతంలో. అదే శిశువు తన నిద్రలో రణరక్త ప్రవాహ సిక్తమైన ప్రపంచాన్ని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఎలా దర్శిస్తున్నదో ప్రముఖ రచయిత రామా చంద్రమౌళి తన ‘శిశువు చిత్రనిద్ర’ కవితలో అక్షరీకరించారు. చివరికి మనిషి జీవితం అంటే రావడం, పోవడం అని ముగిస్తారు. సమాజం మంచిగా, ఉన్నతంగా ఉండాలనే ఆకాంక్ష ఈ కవితలో దాగిన రహస్యం. ‘స్త్రీ’ అనే కవితలో స్త్రీని భూమికి ప్రతీకగా, ప్రాణం పోసే తల్లిగా ఎంతో ఉన్నతంగా చూపుతారు. ప్రజలను ఆస్తులుగా చూస్తూ, కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ ప్రభుత్వాలు వాటిని వృథా చేస్తున్నా, పట్టించుకోని అశక్తత ఆవరించిన మనుషులను గొర్రెలతో పోలుస్తూ సాగుతుంది ‘కొన్ని గొర్రెలు.. ఒక పూర్ కంట్రీ’ కవిత. మనిషి చైతన్యంతో బతకాలనే సందేశాన్ని ఇస్తుంది.
ఆధునిక మానవుడు నిరంతరం పరుగులు తీస్తూనే ఉండాలి. అప్పుడే విజేతగా నిలుస్తాడు. ఈ క్రమంలో విజేతలకు పరాజితులే పాఠం చెబుతారని ‘ఓడిపోతున్నవాడే గెలిచేవాడికి పాఠం’ కవితలో అక్షరీకరించారు. ఇక ‘నువ్వు మెల్లమెల్లగా మరణిస్తుంటావు’ కవితలో బతికి ఉన్నప్పటికీ మనిషి మరణించినవాడితో ఎప్పుడు సమానుడవుతాడో వివరించారు. ఇది ప్రసిద్ధ స్పానిష్ కవి పాబ్లో నెరుడా కవితకు తెలుగు అనువాదం. మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాట వ్యూహాల నేపథ్యంగా సాగిన ‘అంతిమ అనివార్యత అహింసే’లో అహింస ప్రాధాన్యాన్ని వివరించారు. ‘నాన్న సూర్యుడు’ కవితలో మనిషి జీవితంలో తండ్రి గొప్పతనాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టారు. రామా చంద్రమౌళి ‘శిశువు చిత్రనిద్ర’ సంకలనంలోని మిగిలిన కవితలు కూడా ఆలోచనాత్మకంగా సాగుతాయి.
శిశువు చిత్రనిద్ర
రచన: రామా చంద్రమౌళి
పేజీలు: 107; ధర: రూ. 160
ప్రచురణ: పుస్తక
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 93901 09993బుక్ షెల్ఫ్
ఈ సూర్యుడు అస్తమించడు
రచన: గంగుల
నరసింహారెడ్డి
పేజీలు: 224;
ధర: రూ. 200
ప్రచురణ: రాగ
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 90102 84700
పిట్ట గూళ్ళు
రచన: మేరెడ్డి యాదగిరి రెడ్డి
పేజీలు: 76; ధర: రూ. 100
ప్రచురణ: ధృతి
ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
ఫోన్: 99494 15796
ఎవరు మారాలి?
రచన: సురేఖ పులి
పేజీలు: 110; ధర: రూ.150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98487 87284