ఈ మనుషులందరి కష్టాలను తీర్చడం ఆ భగవంతుడికి వీలుకాకే అమ్మను పుట్టించాడేమో! తన కలలను చంపుకొని భర్త, పిల్లలంటూ కుటుంబ భారాన్ని మోసే ఎంతోమంది తల్లుల ఆత్మగీతమే ఈ పుస్తకం. తన శేష జీవితంలో నచ్చిన ప్రదేశాలు, దైవదర్శనాలు చేసుకోవాలని కలలుకంటుంది విశాలక్షి. కానీ తన పిల్లల పిల్లలకు కూడా సేవలు చేస్తూ మానసికంగా కుంగిపోతుంది. ‘అమ్మకూ.. కలలుంటాయి’ అని తన కొడుకును హత్తుకొని దుఃఖిస్తూ పాఠకులను కంటతడి పెట్టిస్తుంది.
భారతికి పిల్లలు పుట్టరని డాక్టర్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ వల్ల పిల్లల కోసం రెండో పెళ్లికి కూడా సిద్ధమవుతాడు సుధాకర్.
తీరా లోపం సుధాకర్దే అని సరైన రిపోర్ట్ ఇవ్వడంతో మాట మార్చిన వైనం ‘మగన్యాయం’ అంటూ పురుషుడి స్వార్థాన్ని తేటతెల్లం చేస్తుంది. కుటుంబం కోసం ఉద్యోగం చేసే ధీర సమీర. బయట పురుష సమాజంలో ఎదుర్కొనే మానసిక వేదనను వర్ణిస్తూనే, ఆ మూర్ఖులపై ‘ఆమె జయిస్తూనే ఉంది’ అంటూ ఆడపిల్లందరూ ఇలాగే తిరగబడాలన్న సందేశం ఈ కథలో మనకు అర్థమవుతుంది. మంచి మనుషులుంటే ఆ ప్రాంతమంతా సస్యశామలంగా ఉంటుందని చెబుతూ ‘ఆ ఇంటి గాలి’ మహిమగా అభివర్ణించే తీరు ఆసాంతం ఆకట్టుకుంటుంది. ఇలా కుటుంబ విలువలు, మహిళల త్యాగాలను వర్ణిస్తూనే ఈ కథలన్నీ సాగుతూ ఉంటాయి. చదువుతున్నంత సేపు వాటితో మనం ప్రయాణిస్తాం. తెగిపోతున్న బంధాలను, అనుబంధాలను అతికించే జిగురు ఈ పుస్తకం.
రచయిత: గంగుల నరసింహారెడ్డి
పేజీలు: 132, ధర: రూ.150
ప్రతులకు: 90102 84700, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
-రాజు పిల్లనగోయిన
రచన : కె. ఆనందాచారి
పేజీలు : 112
ధర : రూ.100
ప్రచురణ : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94900 99437