సమాధానాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, సందేశాలు, ముగింపులు ఖచ్చితంగా ఉండనివి అబ్సర్డ్ కథలు. అవి పాఠకుల మస్తిష్కంలో ప్రశ్నలు మేల్కొల్పుతాయి. వారిని అంతర్మథనానికి గురి చేస్తాయి. నిశ్శబ్దం వెనుక గుసగుసలను వినమని చెబుతాయి. ‘అసంగత’ అబ్జర్డ్ కథలు కూడా.. గబగబా చదివి ముందుకు సాగనిచ్చేవి కాదు. అవన్నీ కథకురాలి మనసు నుంచి తొంగిచూసిన ‘ఫ్రీ థాట్స్’. ఈ సంకలనంలోని ‘వర్ణ’ అనే కథ పంచరంగుల వర్ణచిత్రం చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. మనిషి లోపల ఉండే నొప్పి, కోపం, ఆవేశం.. వీటికి ప్రాతినిథ్యం వహించే రంగు ఏది? అనే ప్రశ్నలను రేకెస్తుంది. ‘రహస్య’ అనే మరో కథ.. సముద్రం నేపథ్యంలో నడుస్తుంది. మనిషి నైతికత, నిబద్ధత గురించి నర్మగర్భంగా చెబుతుంది. మనిషికి ఒంటరితనం అనేది వెన్నంటే ఉంటుంది.
కాబట్టి, లోపల ఉండే ‘నేను’ను అర్థం చేసుకోగలగాలి. అప్పుడే జీవితం అర్థమవుతుందనే జిడ్డు కృష్ణమూర్తి వేదాంతసారాన్ని నిబిడీకృతం చేసిన కథ.. ‘ఐ’. ఇక మనిషి ద్వంద్వ ప్రవృత్తి గురించి, నిజాన్ని ఆమోదించలేని నిస్సహాయత గురించి.. ‘వాడు-నేను’ అనే కథలో సరియలిస్టిక్గా చెప్పే ప్రయత్నం చేసారు రచయిత్రి. ‘రిఫ్లక్షన్’ కథ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, యాసిడ్ దాడుల నేపథ్యంలో సాగుతుంది. ఇలాంటివే.. రెప్ప మూత, నైరూప్య, ఇనుప చువ్వల దడి, సోలో లోక్విరియాలిటీ పారడాక్స్, స్పర్శ ది టచ్, మరో తలుపు కథలు అద్భుతమైన జీవితసారాన్ని చెబుతాయి. ఈ కథాసంపుటిలోని కథలన్నీ ఏకబిగిన చదివి మూలన పడేసేవి కావు. కథలోని వాక్యాలను అర్థం చేసుకుంటూ.. మన భావాలకు ఆపాదించుకుంటూ అంతర్మథనం చెందుతూ చదవాల్సిన కథలు.
రచయిత్రి: మణి వడ్లమాని
ప్రతులకు: నవోదయ మరియు అచ్చంగా తెలుగు. కామ్
ఫోన్ : 85588 99478
ధర: రూ.120
-డాక్టర్ ఎమ్. సుగుణరావు
అనువాదం : హిమజ
పేజీలు : 145;
ధర : రూ.150
ప్రచురణ : ప్రోజ్ పోయెట్రీ ఫోరం
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94414 92737
సంకలనం : కూతురు రాంరెడ్డి
పేజీలు : 152;
ధర : రూ.200
ప్రచురణ : కూతురు ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 90004 15353
రచన : ఎలనాగ
పేజీలు : 130;
ధర : రూ.150
ప్రతులకు : నవోదయ బుక్‌హౌస్
ఫోన్ : 98669 45424