వార్త కూడా సరుకే. ప్రసార మాధ్యమాలపై పెట్టుబడిదే పైచేయి అయినప్పుడు సరుకుల అమ్మకాలు పెంచే వార్తలు దట్టించే పని పెరిగిపోయింది. కళలు, సామాజిక రంగాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అటు పెట్టుబడికి అవసరం లేని, ఇటు మధ్య తరగతికి ఆసక్తి లేని పేద రైతు గురించి ఎవరు పట్టించుకుంటారు? కాడి నుంచి నాగలి వేరుపడినట్టు యాజమాన్యం, పాత్రికేయులు వ్యవసాయానికి దూరమైపోయారు. వడ్డించేవాడు మనవాడన్నట్టు… పుట్టి పెరిగిన తీపి ఉండో, అన్నం పెట్టే రైతు పట్ల కృతజ్ఞతోనో అక్షర సేద్యం చేయడానికి పూనుకున్న పాత్రికేయుల్ని అభినందిస్తూ రైతు నేస్తం ఈ పుస్తకం ప్రచురించింది. దీనికి ‘రైతన్నకు వెన్ను దన్ను’ (కలం-గళం-దృశ్యం) అని నామకరణం చేసింది.
పేరు చూడగానే ఇది రైతు ఉద్యమం గురించి అని పొరబడవచ్చు. ఈ పుస్తకంలో పరిచయస్తులెవరూ సంఘాల్లో నాయకులు కాదు. కానీ, ఉద్యమకారులే! పత్రికా రంగంలో పెద్దగా ప్రాధాన్యం లేని, ఎదుగుదలకు అవకాశాలు లేని వ్యవసాయాన్ని ఎంచుకుని వార్తలు రాయడమంటే సామాజిక ఉద్యమకారుడి కృషికి తక్కువేమీ కాదు. విత్తనాలతో సైద్యం చేసే రైతుకు దన్నుగా అక్షర సేద్యం చేసిన పాత్రికేయలందరి నేపథ్యాలు, అనుభవాలు, సాధించిన విజయాలెన్నిటినో ఈ పుస్తకం పరిచయం చేసింది. తెలుగు జర్నలిజంలో వ్యవసాయరంగ వార్తల ప్రాధాన్యంతోపాటు దాని చరిత్రను తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. పత్రికలు, రేడియో, టీవీలలో వ్యవసాయ వార్తలు, విశేషాలను పంచుకుని పాత్రికేయ రంగానికి పేరు, అన్నదాతకు మేలు చేకూర్చిన యాభై మంది వ్యవసాయ పాత్రికేయుల కృషిని చిరస్మరణీయం చేసే ప్రచురణ ఇది.
సంపాదకత్వం: వలేటి గోపీచంద్
ప్రచురణ: డా॥ ఐవీ సుబ్బారావు స్మారక కమిటీ, రైతునేస్తం పబ్లికేషన్స్
పేజీలు: 184, ధర: రూ.250
ప్రతులకు: 94412 76770
రచన : డా. దిలావర్
పేజీలు : 116;
ధర : రూ.150
ప్రచురణ : సమతా ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 98669 23294
రచన : జక్కని వేంకటరాజం
పేజీలు : 56;
ధర : రూ.75
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94400 21734