జీవితమే కథలకు పుట్టిల్లు. కానీ, కథ చదివినంక ఇట్ల జరుగుతుందా అని సందేహం రావడమే విచిత్రం. అనేక సందర్భాల్లో, అనేక జీవితాల్లోని ఘటనల ప్రేరణతో కథ పుడుతుంది. కాల ప్రభావం, మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు జీవితాన్ని ఎట్ల నడిపిస్తాయో చెప్పే ప్రయత్నంలో రచయిత అనేక ప్రయోగాలు చేస్తాడు. కాబట్టి జీవితం సాధారణమే అయినా కథ మాత్రం అసాధారణంగా ఉంటుంది. అందుకే అవి అమితంగా పాఠకుల్ని ఆకట్టుకుంటాయి. డాక్టర్ ఉదారి నారాయణ రాసిన ‘యాపచెట్టు’ కథా సంకలనంలోని ఊరు మీది ముచ్చట్లు చదువుతుంటే ‘మనకూ ఇలా జరిగిందే! మనమూ ఇలా అనుకున్నామే’ అనిపిస్తుంది.
కథ రాయడం కోసం ప్రసవ వేదనపడే కథకులు యాపచెట్టును చదవాలి. ఇందులోని కథలన్నీ ఊళ్లలో వినిపించేవే. కనిపించేవే. ఈ కథల్లోని భాష ఆదిలాబాద్ పల్లె భాష. ఈ కథలన్నిటిలో సామాన్యుల ఆలోచనా స్థాయికి తగిన సంభాషణలు ఉన్నాయి. రాజకీయాలు, పార్టీలు, ప్రభుత్వ పథకాలు, జనం సమస్యలు, వ్యవసాయం, సామాజిక జీవితంలో ఉండే ముచ్చట్లెన్నో కథలుగా మలిచాడు రచయిత. మధ్య తరగతి జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడే తెలుగు రచయితలకు భిన్నంగా గ్రామీణ నేపథ్యంతోనే కథలు రాసిన ఉదారి నారాయణ అభినందనీయడు.
రచన: డాక్టర్ ఉదారి నారాయణ
పేజీలు: 96; ధర: రూ.100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
ఫోన్: 98487 87284
ప్రధాన సంపాదకులు: దండనాయకుల వామన్ రావు
పేజీలు: 150;
ధర: రూ. అమూల్యం
ప్రచురణ: జిల్లా సాహితీ సంరక్షణ సమితి
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
ఫోన్: 98487 87284
రచన: ఎమ్వీ రామిరెడ్డి
పేజీలు: 243;
ధర: రూ. 250
ప్రచురణ: బోధి ఫౌండేషన్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 92474 71362