మానవ జీవన దర్శనానికి సంబంధించిన విశిష్ఠ అంశాలను చిత్రించిన పుస్తకాల్లో ఈ నవలది ప్రత్యేక స్థానం. ఆశలు, కోరికలు దుఃఖానికి హేతువు అన్నాడు బుద్ధుడు. కానీ, అవే లేకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమన్నది శివయ్య కుటుంబం వేసుకున్న ప్రశ్న. సుమిత్రమ్మ భర్త చనిపోవడంతో కొడుకు శివయ్యను ప్రయోజకుణ్ని చేస్తుంది. ఉద్యోగం సాధించిన శివయ్య మేనమామ కూతురు మంజులను పెళ్లి చేసుకుంటాడు. అప్పటి వరకు కల్మషం లేకుండా అమ్మచాటు బిడ్డగా కనిపిస్తాడు. వివాహం తరువాత భార్య, తల్లి మధ్య పోరుతో నలిగిపోతాడు. మగబిడ్డే కావాలనే అత్యాశతో ఐదురుగు ఆడపిల్లలకు జన్మనిచ్చి వాళ్ల పోషణకోసం నానా తిప్పలు పడతాడు.
మొదటి ఇద్దరు కూతుర్ల పెండ్లి అంగరంభ వైభవంగా చేయడం కోసం భార్య మాటలు నమ్మి అడ్డదారులు తొక్కుతాడు. చివరికి ఉన్న పొలమమ్మి వాళ్ల పెండ్లిళ్లు చేస్తాడు. తర్వాత పిల్లల పెండ్లికోసం ఇల్లునే అమ్మాలనే ఆలోచన చేస్తాడు. అజ్ఞానంతో కండ్లు మూసుకుపోయిన తల్లిదండ్రులకు జ్ఞానోదయం చేస్తుంది మూడో కూతురు కృత్తిక. శివయ్య పాత్రలో మార్పును చివరిలోనే చూపించకుండా మొదటినుంచే పరిపక్వత పెంపొందించేలా సదానందం పాత్రను సృష్టించాడు రచయిత. ఈ పాత్రలు కల్పితాలే కావొచ్చు కానీ, మనచుట్టూ అల్లుకున్నవే. లేనిపోని హెచ్చులకు పోయి ఊబిలో కూరుకుపోయే సగటు జీవులు.. క్షణాల్లోనే కోటీశ్వరులవ్వాలని భావించే యువతరం ఈ నవల చదివి ఏ కొంచమైనా మారితే ఎంతో ప్రయోజనకరం.
రచయిత: డాక్టర్ కాలువ మల్లయ్య
పేజీలు: 128, ధర: రూ.125
ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ ,94900 99378
-రాజు పిల్లనగోయిన
రచన : డా. ఉదారి నారాయణ
పేజీలు : 96
ధర : రూ.100
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 98487 87284
రచన : ఈతకోట సుబ్బారావు
పేజీలు : 67
ధర : రూ.80
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94405 29785