పండితులు, పామరులు అనే తారతమ్యం లేకుండా అందరినీ అలరించే మాధ్యమం సినిమా! చిత్రసీమ సంగతులు, నటీనటుల విశేషాలు ఎక్కడ వినిపించినా చెవులు రిక్కించి వింటాం. రోజులు మారినా.. సినిమా ముచ్చట్లపై ఆసక్తి పెరుగుతున్నదే కానీ, తగ్గడం లేదు. ముఖ్యంగా తరాల కిందటి తారల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంటుంది. ఎన్టీయార్ సినీ ప్రస్థానం, మహానటి సావిత్రి జీవితం, గుమ్మడి నట వైచిత్రి… ఇలా వెండితెర దిగ్గజాల గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపిస్తుంటుంది.
అలాగే ‘లవకుశ’, ‘మూగమనుసులు’ లాంటి క్లాసిక్ సినిమాల ప్రస్తావన వస్తే చాలు.. మనసు పులకించిపోతుంది. సినిమాకు ఉన్న శక్తి అలాంటిది. ఈ సంగతులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ఇలా రకరకాల భాషా చిత్రాలపై మంచి పట్టున్న ఎమ్బీయస్ ప్రసాద్ లాంటి వాళ్లు చెబితే.. మరింత ఆసక్తికరంగా ఉంటుంది. సినీ ప్రపంచంపై సాధికారత ఉన్న ఆయన వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాల సంకలనమే ‘సినీమాన్యులు-2’.
సినిమా కథల విశేషాలు, తారల జీవితాలు, తారేతర నిపుణుల విశేషాలన్నిటినీ ఇందులో సవిస్తరంగా వివరించారు రచయిత. ఈ రెండో సంపుటిలో దర్శక నిర్మాత ఎల్వీప్రసాద్, రచయిత ముళ్లపూడి, గాయకుడు ఘంటసాల, హిందీ కవి శైలేంద్ర ఇలా ఎందరెందరో లబ్ధప్రతిష్ఠుల సినీ ప్రయాణాన్ని ప్రస్తావించారు. హాలీవుడ్ సినిమాలనూ స్పృశించారు. నిర్మాతల గురించీ పంచుకున్నారు. మొత్తంగా 24 వ్యాసాలు కూర్చిన ఈ సినీ కదంబం కావాల్సినంత సమాచారాన్ని అందిస్తుంది. సందర్భానుసారంగా ప్రస్తావించిన తెర వెనుక సంగతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
రచయిత: ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు: 248, ధర: రూ.150
ప్రతులకు: 90004 13413 నవోదయ బుక్ హౌస్, కాచిగూడ www.telugubooks.in
నడుస్తున్న చరిత్ర (కవితా సంకలనం)
రచన: ఏనుగు కిశోర్‌బాబు
పేజీలు: 104;
ధర: రూ. 180
ప్రచురణ: వీ ఎస్ గ్రాఫిక్స్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98400 81386
సంపాదకుడు : డీ వామన్ రావు
పేజీలు : 150;
ధర : అమూల్యం
ప్రచురణ : జిల్లా సాహితీ సంరక్షణ సమితి (మంచిర్యాల)
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 99899 63730