ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సకాలంలో వర్షం పడితే రైతులకు సంబరం. ఏ కారణంతోనైనా వరుణుడు అలిగితే రైతుల కంట్లో కన్నీళ్ల ధారలే. వర్షచ్ఛాయ ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో వాన కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తుంటారు. గంగుల నరసింహారెడ్డి ‘వాన కురిసింది’ కథా నేపథ్యం ఈ వాతావరణమే. ఈ కథలో రైతు అనంతరెడ్డి తన పంటకు అదునైన వానకోసం ఎదురుచూస్తుంటాడు. ఇల్లేమో వానొస్తే కురిసే మట్టిమిద్దె. కూతురు, అల్లుడు తొలిరాత్రి సందర్భంలో వానజల్లు మొదలవుతుంది. ఓవైపు ఇల్లు కురుస్తుంటుంది. దీంతో ఆ కొత్తజంట వాన కురవడమే ముఖ్యమని తమ సమాగమాన్ని వాయిదా వేసుకుంటుంది.
రైతు సంతోషమే ప్రధానమని చాటుతుందీ కథ. ఈ సంకలనంలోని మరో 13 కథలు.. దేనికవే ప్రత్యేకం. రాత్రివేళ ఎన్నో భయాల మధ్య సమాజంలో ఓ వివాహితకు భద్రత కలిగినా, ఇంట్లో భర్త అనుమానించిన వైనం ‘కుళ్లిన సంఘం’లో కనిపిస్తుంది. పల్లెల్లో కులాధిపత్యం నీడన బడుగుల బాధలను ‘ప్రశ్న’ కళ్లకు కడుతుంది. బ్యాంకులిచ్చే చాలీచాలని రుణాలతో చిన్న రైతులకు ఎదురయ్యే విపత్కర పరిస్థితిని ‘ఎ లోన్ స్టోరీ’ వివరిస్తుంది. పిరికితనానికి, మంచితనానికి మధ్య తేడాను ‘రాముడు మంచి బాలుడు’ తేటతెల్లం చేస్తుంది. ‘ఒడిబియ్యం’ మనుషుల మధ్య అనుబంధాలే ముఖ్యమని చాటుతుంది.
‘కొనుక్కోవాలి’ కథ వృద్ధులైన తల్లిదండ్రులు పిల్లల ఆప్యాయతను ఎలా పొందాలో వెల్లడిస్తుంది. వృద్ధాశ్రమం నుంచి సొంతూరు వెళ్లిన మనిషి తన మిత్రులతో ఆనందంగా గడపడానికి ఏ నిర్ణయం తీసుకున్నాడో ‘శిథిల సంధ్యలో చిరుదీపం’ తెలుపుతుంది. గంగుల నరసింహారెడ్డి వివిధ సందర్భాల్లో రాసిన ఈ కథలు పాఠకుల్లో మంచిని పెంచేలా సాగుతాయి.
పేజీలు: 144; ధర: రూ. 180
ప్రచురణ: రాగ ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 90102 84700
రచన: లావణ్య బుద్ధవరపు
పేజీలు: 200;
ధర: రూ. 200
ప్రచురణ: కవి పబ్లికేషన్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413
రచన: బొల్లారపు బాబన్న
పేజీలు: 117;
ధర: రూ. 100
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ఫోన్: 98487 87284