ప్రపంచం.. మనం ఎలా భావిస్తే అలా కనిపిస్తుంది. మంచిగా ఊహించుకుంటే గొప్పగా ఉంటుంది. చెడ్డగా ఆలోచిస్తే భీతిగొల్పుతుంది. దీన్నే ‘యద్భావం తద్భవతి’ అని పేర్కొంటారు. ఆర్.సి. కృష్ణస్వామిరాజు ఆధ్యాత్మిక కథల సంకలనం ‘యద్భావం తద్భవతి’ ఇదే విషయం ప్రధానంగా సాగుతుంది. సృష్టిలో అన్ని ప్రాణులూ సమానమే. సృష్టిలో విభజన అనేది ప్రత్యేకంగా ఉండదు. బుద్ధిజీవుడైన మనిషే విభజన తయారుచేశాడు. కాబట్టి, అందరూ మనవాళ్లే అనుకుంటే జీవితం మధురంగా, ఆనందంగా సాగిపోతుంది. అలా కాదని ఇంకా ఇంకా విభజనలు చేసుకుంటూ పోతే మాత్రం భయంకరంగా అనిపిస్తుంది. కృష్ణస్వామిరాజు ఈ పుస్తకంలో ఉదహరించిన కథల సందేశం ఇదే.
మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. అందుకే అన్ని ప్రాణులపట్ల ప్రేమ చూపాలి. దేవుడంటే ఆలయాల్లోనే కాదు మనం నమ్మితే కంకరలోనూ శంకరుడే కనిపిస్తాడు. మనకు ఎదురయ్యే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అణగిమణగి ఉండాలి. సవాళ్లకు ఎదురీదాలి. కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలి. జీవన ప్రయాణంలో చెడును పరిహరించుకుని మంచిని పెంచుకోవాలి. పైగా మన జీవితాలు ఎంతో చిన్నవి, ప్రతి క్షణం ప్రకృతి ప్రసాదించిందని తెలుసుకుంటే మన బతుకులు ఆనందంగా సాగిపోతాయి. ‘యద్భావం తద్భవతి’లోని కథలు ఈ సత్యాలనే తేటతెల్లం చేసి పాఠకుల్లో స్ఫూర్తిని నింపుతాయి. ఈ కథలు కేవలం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే కాదు, జీవితంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సినవే.
రచన: ఆర్.సి. కృష్ణస్వామిరాజు
పేజీలు: 136; ధర: రూ. 160
ప్రచురణ: ఆదర్శిణి మీడియా
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 93936 62821
రచన: లాల లింగమూర్తి
పేజీలు: 363;
ధర: రూ. 100 ప్రచురణ- ప్రతులకు: చిట్టి పబ్లికేషన్స్
ఫోన్: 89195 49274
రచన: ప్రమోద్ ఆవంచ
పేజీలు: 128;
ధర: రూ. 100
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98487 87284