ఊహల్లో ఉదయించిన రేఖలతో కథలు రాస్తారు కొందరు. అనుభవసారాన్ని రంగరించి కథలుగా చెక్కుతారు ఇంకొందరు. రచయిత ఏ పద్ధతి అవలంబించినా.. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలే పాఠకుల హృదయాల్లో నిలిచిపోతాయి. చాగంటి ప్రసాద్ రాసిన ‘పరిష్వంగం’ కథల సంపుటి ఈ కోవకే చెందుతుంది. ఈ కథల్లో లేనిపోని వర్ణనలు కనిపించవు. ఉన్నవి దాచినట్టూ అనిపించదు. పదునైన సంభాషణలతో సాగిపోయే పాత్రలు.. ఔచిత్యంగా అనిపిస్తాయి. కథను పరిగెత్తించే తీరు ఉత్సుకతను కలిగిస్తుంది. వివిధ పత్రికల్లో ప్రచురితమైన ‘పరిష్వంగం’ కథలు చదివే కొద్దీ వాస్తవిక దృక్పథం అలవడుతుంది.
రచయిత స్పష్టమైన భావాలు.. మన గతానుభవాలను సంస్కరిస్తాయి. ఇందులోని ‘అద్దం నవ్వింది’ కథ ఓ సాధారణ వ్యక్తి కథ. పరిస్థితికి తలొగ్గినప్పుడు ఆ సాధారణ మనిషి వికృతంగా మారిపోతాడు. తనను తాను సంస్కరించుకున్న తర్వాత.. అసాధారణ వ్యక్తిత్వంతో అలరారుతాడు. ‘గమ్యం’ కథ సాదాసీదాగా సాగిపోయినా.. బంధం విలువను తెలియజేస్తుంది. ‘పరిష్వంగం’ కథ విషయానికి వస్తే.. తండ్రీకొడుకుల అనుబంధానికి మచ్చుతునకలా కనిపిస్తుంది. కొడుకును అర్థం చేసుకున్న తండ్రి కథ ముచ్చటగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ సంకలనంలోని 21 కథల్లో దేనికదే ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది. చదివి మీరూ సంతృప్తి చెందండి.
రచయిత: చాగంటి ప్రసాద్
పేజీలు: 168, వెల: రూ.150
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు, సాహితి ప్రచురణలు, 81210 98500
రచన: డా. ఉదారి నారాయణ
పేజీలు: 136;
ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98487 87284
రచన: పలమనేరు బాలాజి
పేజీలు: 175;
ధర: రూ. 200
ప్రచురణ: స్వచ్ఛత ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 94409 95010