ఫ్రెంచి కథా సాహిత్యంలో గై డీ మొపాసాది అగ్రస్థానం. తన 42 ఏండ్ల జీవిత కాలంలో ఆయన 300 కథలు, 6 నవలలు, ఇంకొన్ని ఇతర రచనలు చేశాడు. ‘బెల్ అమీ’ ఆయన రెండో నవల. ఈ పదానికి ‘మంచి స్నేహితుడు’ అని అర్థం. నవలా నాయకుడు జార్జి డ్యురోయ్ ఫ్రాన్స్ దేశంలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి అవకాశాలను వెతుక్కుంటూ పారిస్ చేరుకుంటాడు. ఓ సంస్థలో గుమాస్తా ఉద్యోగం వెతుక్కుంటాడు. ఈ క్రమంలో తన పాత స్నేహితుడు చార్లెస్ ఫోరస్టైర్ను కలుసుకుంటాడు.
అతని ప్రోద్బలంతో ‘లావై ఫ్రాంకైజ్’ అనే ప్రముఖ పత్రికలో రిపోర్టర్‌గా చేరతాడు. ఫోరస్టైర్ భార్య మేడలిన్తో పత్రికలో రాసే విధానం నేర్చుకుంటాడు. ఫోరస్టైర్ ఇంటిని ఫ్రాన్స్‌లో బాగా పేరున్న కొంతమంది సందర్శిస్తుంటారు. వారితో డ్యురోయ్ పరిచయాలు పెంచుకుంటాడు. స్వతహాగా అందగాడైన డ్యురోయ్ పట్ల ఫోరస్టైర్ మిత్రులైన కొంతమంది స్త్రీలు ఆకర్షితులవుతారు. వీరిలో మేడలిన్ స్నేహితురాలు మెరెల్లితోపాటు లావై ఫ్రాంకైజ్ యజమాని, ఆ పత్రిక ప్రధాన సంపాదకుడు వాల్టర్ భార్య వర్జిన్ వాల్టర్ కూడా ఉంటుంది. చార్లెస్ ఫోరస్టైర్ వ్యాధితో మరణించడంతో డ్యురోయ్ మేడలిన్ను పెళ్లి చేసుకుంటాడు.
చివరికి వాల్టర్ దంపతుల కూతురు సుజానిని కూడా తనవైపు తిప్పుకొంటాడు. తన కొత్త బంధానికి అడ్డుగా ఉన్న భార్య మేడలిన్ను వదిలించుకుంటాడు. భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడనే నమ్మకంతో వాల్టర్ దంపతులు కూడా సుజానీని డ్యురోయ్కు కట్టబెడతారు. సామాజికంగా ఆర్థికంగా తాను ఎదగడానికి తనకు అవసరం ఉన్నవారిని తెలివిగా వాడుకుంటూ డ్యురోయ్ ఆడిన ఆటే ‘బెల్ అమీ’ ఇతివృత్తం. ఎంతో ఉత్కంఠగా సాగిపోయే ఈ నవలను ప్రముఖ రచయిత్రి బీనాదేవి తెలుగులో అనువదించారు. ఒక్కసారి మొదలుపెడితే.. ఆపకుండా చదివించే శైలిలో సాగుతుందీ నవల.
మూలం: గై డీ మొపాసా
అనువాదం: బీనాదేవి
పేజీలు: 144; ధర: రూ. 100
ప్రచురణ: సాహితి, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 0866 2436642/ 43
రచన: వంశీకృష్ణ
పేజీలు: 136;
ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98487 87284
సంపాదకత్వం: కుమార్ కూనపరాజు
పేజీలు: 384;
ధర: రూ. 300
ప్రచురణ: సాహితి
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 0866- 2436642/ 43
రచన: పెన్నా శివరామకృష్ణ
పేజీలు: 125;
ధర: రూ. 150
ప్రచురణ: బోధి ఫౌండేషన్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 94404 37200