భారత ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశపు అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు ఇటీవల ఒక దేశం ప్రకటించింది. అది ఏది?
మన పొరుగుదేశం మారిషస్లో ఈ మధ్య ఎన్నికలు జరిగాయి. ‘ద అలయన్స్ ఫర్ చేంజ్’ కూటమి విజయం సాధించడంతో కొత్త ప్రధానిగా బాధ్యతలు ఎవరు చేపట్టారు?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల దేశపు తొలి అనలాగ్ స్పేస్ మిషన్ను ఎక్కడ ప్రారంభించింది?
2024 సంవత్సరానికి గాను ప్రఖ్యాత సత్యజిత్రే జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ దర్శకుడికి ఈ అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరు?
థాయ్లాండ్ దేశం తమ బ్రాండ్ అంబాసిడర్గా, పర్యటక రంగ గౌరవ సలహాదారుగా ఒక భారత నటుడి పేరును ప్రకటించింది. ఎవరు అతను?
ఈ మధ్య ‘యాంటీ స్లేవరీ కమిషనర్’ను నియమించిన దేశం ఏది? మారిన ప్రపంచంలో కొత్త తరహా బానిసత్వానికి వ్యతిరేకంగా ఈ విభాగం పనిచేయనుంది. బలవంతంగా పనిచేయించడం, మనుషుల్ని వేరే చోట్లకి సరఫరా చేయడం, ఇష్టం లేకుండా పెండ్లి చేయడం, అప్పు కట్టలేదని బానిసను చేసుకోవడంలాంటివి ఇందులో ఉన్నాయి.
పర్యావరణ మార్పులపై మొన్న కాప్29 సదస్సు జరిగింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుల్లో భారత్ సహా అమెరికా, చైనా, ఫ్రాన్స్, జర్మనీలాంటి 200 సభ్యదేశాలు పాల్గొంటుంటాయి. ఇటీవల ఈ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా కొలువైన సంగతి తెలిసిందే. ఇందులో ఫాక్స్న్యూస్ అనే టీవీ చానెల్ ప్రయోక్త అయిన పీట్ హేగ్సేత్కు ఆ దేశంలోని కీలక మంత్రిత్వ శాఖను కేటాయించారు. అది ఏది?
ఇంటర్నేషనల్ బిల్లియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ (ఐబీఎస్ఎఫ్) ఇటీవల నిర్వహించిన ప్రపంచ
బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచిన భారత ఆటగాడు ఎవరు? ఇప్పటికి దాకా ఈ ఆటలో అతను 28 ప్రపంచ చాంపియన్ టైటిళ్లను గెలుచుకున్నాడు.
వ్యోమగాములపై రాసిన నవలకు గాను బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే పఖ్యాత బుకర్ పురస్కారాన్ని (2024) అందుకున్నారు. ఆమె రాసిన నవల పేరు ఏమిటి?