‘ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. పద్మవ్యూహం లాంటి ప్రపంచంలో మనిషి నిత్యం ఎన్నో రకాల సంఘర్షణలు ఎదుర్కొంటూ సుఖమయ జీవితం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఎంత సుఖంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నా ఏదో విషయంలో సంఘర్షణ చెందుతూనే ఉంటాడు. ఈ సంఘర్షణ నిత్యం ఉంటూనే ఉంటుంది. మనిషి జీవితమే నిత్య సంఘర్షణ. ఇక కవి హృదయం నిరంతరం ఏదో సమస్యతో సంఘర్షిస్తూనే ఉంటుంది. అటువంటి సంఘర్షణకు లోనై తనకు తన స్పందనల ద్వారా బయట ప్రపంచానికి తన భావాన్ని వ్యక్తం చేస్తాడు.
డా॥ కాంచనపల్లి గోవర్ధనరాజు అనేక సంఘర్షణలను మౌలికాంశాలుగా తీసుకొని ప్రత్యేకంగా మలచిన ‘పెంకుటిల్లు’ ఈ కోవకు చెందినదే! వర్తమాన అంశాలు, సామాజిక అసమానతలు, చిన్ననాటి జ్ఞాపకాలు, యవ్వనంలో మధురానుభూతులు ఇలా తన మనసును ప్రేరేపించిన అనేకానేక అంశాలపై హృదంతరాల్లో దొర్లిన భావాలను అందమైన కవితలుగా ఆవిష్కరించారు కాంచనపల్లి. ‘కుదురు’, ‘నాన్నా నేను వెళ్ళక తప్పదు’, ‘ఇంటికాపు’, ‘ఇల్లు ఖాళీ చేస్తుంటే’, ‘గుండె పలుకులు’ మొదలైన కవితలన్నీ బాల్యపు జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేసేవే! మొత్తంగా చెప్పాలంటే ‘పెంకుటిల్లు’ జ్ఞాపకాల కలబోత, బాల్యస్మృతుల తడి అని చెప్పొచ్చు.
రచయిత: డా॥ కాంచనపల్లి గోవర్ధనరాజు
పేజీలు: 118, వెల: రూ.100
ప్రతులకు: 96760 96614
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచన: కృష్ణమూర్తి వంజారి
పేజీలు: 96
ప్రతులకు:
ఫోన్: 73960 11666
పేజీలు: 335,
ధర: రూ. 400
ప్రచురణ: వంశీ ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్
ప్రతులకు:
ఫోన్: 98490 23852
పేజీలు: 593;
ధర: రూ. 500
ప్రచురణ:
ప్రతులకు:
ఫోన్: 98480 30089