మూడు దశాబ్దాల స్త్రీవాద కవిత్వం
పితృస్వామ్య సమాజంలో స్త్రీల మీద సాగుతున్న అణచివేత, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల స్త్రీలు చేస్తున్న అక్షర పోరాటమే ‘స్త్రీవాద’ సాహిత్య ఉద్యమం. ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యానిది ప్రత్యేక స్థానం. 1993 నుంచి 2022 వరకు..
పితృస్వామ్య సమాజంలో స్త్రీల మీద సాగుతున్న అణచివేత, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల స్త్రీలు చేస్తున్న అక్షర పోరాటమే ‘స్త్రీవాద’ సాహిత్య ఉద్యమం. ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యానిది ప్రత్యేక స్థానం. 1993 నుంచి 2022 వరకు.. దాదాపు మూడు దశాబ్దాలుగా స్త్రీవాదం నేపథ్యంలో వచ్చిన 93 మంది కవయిత్రుల 168 కవితలను ఒక్క దగ్గర చేర్చి డాక్టర్ కె.గీత సంపాదకత్వంలో ప్రచురించిన సంకలనం ‘అపరాజిత’. స్త్రీలను పూజించే చోట దేవతలు తిరుగాడతారనేది భారతీయుల విశ్వాసం. ఆ సంప్రదాయం తరతరాలుగా అపహాస్యానికి గురవుతూ వస్తున్నది. ఈ దుస్థితిని ‘నాది పవిత్ర భారతదేశం/ స్త్రీని దేవతగా పూజించే మను జన్మభూమి/ అందుకే నాకు నిత్య ‘అగ్నిహోత్రాలూ’/ బడితె ‘పూజలూ’, ‘ధూప నైవేద్యాలు’!… అంటూ షహీదా రాసిన ‘బోలో స్వతంత్ర భారత నారికీ జై’ అనే 1993 నాటి ఏడు ఖండికల కవితతో ‘అపరాజిత’ ఆరంభమవుతుంది. ‘ఆమెకు బతుకు లేదు/ అమ్మ… అమ్మోరుగా మారితే తప్ప/ భూమికి శాంతి లేదు/ కొత్త నెలపొడుపై ఉదయిస్తే తప్ప’ అంటూ దేవనపల్లి వీణావాణి ‘నెలపొడుపు’ కవితతో ముగిసే ఈ సంకలనంలో గృహహింస, భ్రూణహత్యలు, మహిళల అక్రమరవాణా, ఎంతకూ తేలని చట్టసభల్లో రిజర్వేషన్ల వాటా, లైంగిక దాడులు, వేతనంలో వివక్ష, నెలసరి సమస్యలు.. లాంటి స్త్రీలు అడుగడుగునా ఎదుర్కొంటున్న సవాళ్లపై కలమెత్తారు ఇందులోని రచయిత్రులు. ఓల్గా, కాత్యాయనీ విద్మహే, అనిశెట్టి రజిత, చల్లపల్లి స్వరూపరాణి, మందరపు హైమావతి, కె.గీత లాంటివారి కవితలు పురుషాధిపత్య సమాజం స్త్రీలను ఎలా చూడాలో బుద్ధిచెబుతాయి.
అపరాజిత
సంపాదకులు: డా. కె.గీత, పేజీలు: 468; వెల: రూ. 250,
ప్రతులకు: editor@neccheli.com
బుక్ షెల్ఫ్
34 గోఖలే రోడ్ నార్త్
రచన: డా. తాటి నరహరి
పేజీలు: 89
వెల: రూ. 150
ప్రతులకు: ఫోన్: 093224 00551
దాతి (కవిత్వం)
రచన: దాసోజు లలిత
పేజీలు: 239
వెల: రూ. 200
ప్రతులకు: ఫోన్: 87905 16894
తర్కం (కవిత్వం)
రచన: సోని కట్కూరి
పేజీలు: 121
వెల: రూ. 150
ప్రతులకు: ఫోన్: 83742 61002
చింతలపల్లి హర్షవర్ధన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

