పుస్తక సమీక్ష – ప్రామాణిక పరిశోధక వ్యాసాలు
సురవరం ప్రతాపరెడ్డి 1934లో ‘గోల్కొండ కవుల సంచిక’ను వెలువరించి తెలంగాణలో సారస్వత వారసత్వాన్ని నిరూపించారు. తెలంగాణ సాహిత్య లోకానికి ఆత్మవిశ్వాసం కలిగించి గొప్ప చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు.
సురవరం ప్రతాపరెడ్డి 1934లో ‘గోల్కొండ కవుల సంచిక’ను వెలువరించి తెలంగాణలో సారస్వత వారసత్వాన్ని నిరూపించారు. తెలంగాణ సాహిత్య లోకానికి ఆత్మవిశ్వాసం కలిగించి గొప్ప చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు. ‘తెలంగాణ యశోధరులు’ పుస్తకం ద్వారా సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశారు డాక్టర్ నమిలకొండ సునీత. తన పరిశోధన వ్యాసంగంలో భాగంగా వివిధ దశల్లో తెలంగాణ కోణంతో వెలువరించిన పరిశోధన పత్రాలు, పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. తన పరిధిలో తాను పుట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వేముగంటి నరసింహాచార్యులు, పీవీ నరసింహారావు, సాంబశివుడు, కాశీనాథుడు, మెట్టినిల్లయిన నిజామాబాదు జిల్లాలోని దోర్బల విశ్వనాథశర్మ, అయాచితం నటేశ్వరశర్మ చేసిన సాహిత్య సేవలు, నిజామాబాదు జిల్లా నవలా చరిత్ర, తెలంగాణ సంస్థానాలలో మహిళా సాహిత్యం, తెలంగాణలో అవధాన ప్రక్రియపై ఎంతో శ్రమకోర్చి సమగ్రంగా, సప్రామాణికంగా రాసిన వ్యాసాలు భావి తెలంగాణ సాహిత్య చరిత్ర పరిశోధకులకు కరదీపికలు. ప్రతి నాగరికుడు మాతృభాషలోనే మాట్లాడుతాడు అన్న కోణంలో రాసిన వ్యాసం రచయిత్రి తెలుగు భాషా గరిమకు నిదర్శనం. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు, ఏకవీర నవలలపై సునీత చేసిన సమీక్ష ఆమె పాండిత్యానికి మచ్చుతునక. రైతుపై వెలువరించిన వ్యాసం కవికోకిల దువ్వూరి రామిరెడ్డి సారస్వత వారసత్వానికి యోగ్యతా పత్రం లాంటిది.
తెలంగాణ యశోధరులు
రచన: డాక్టర్ నమిలకొండ సునీత
వెల: రూ. 150
ప్రచురణ: సునిశిత ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 99084 68171
బుక్ షెల్ఫ్
ఆ రోజుల్లో…రచన: అల్లంరాజు రాధాకుమార్
పేజీలు: 200
వెల: రూ. 150
ప్రచురణ: సుమిర క్రియేషన్స్
ప్రతులకు:
ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 94903 70248
ఆనంద హేల
రచన: గండ్రకోట
సూర్యనారాయణ శర్మ
పేజీలు: 120
వెల: రూ. 150
ప్రచురణ:
అచ్చంగా తెలుగు ప్రచురణ
ఫోన్: 85588 99478
భాగ్యోదయం
రచన: ఎం.బి.గౌతమ్
పేజీలు: 126, వెల: రూ. 70
ప్రచురణ: సమాంతర ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
ఫోన్: 92465 86254
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్




