ట్రావెలింగ్.. నేటి తరానికి ఓ హాబీగా మారిపోయింది. సమయం, సందర్భం లేకుండా జర్నీలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రావెల్‌కి అనువైన వాటిని ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. ఇదిగో ఈ బుజ్జి ఎల్ఈడీ లైట్ కూడా ట్రావెలర్స్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. దారి చూపించే టార్చ్లైట్గా వాడొచ్చు. రాత్రిళ్లు అనుకోకుండా కారు లేదా బైక్ ఆగిపోతే రిపేర్ చేసే క్రమంలో ఈఎల్‌ఈడీ లైట్‌ని తలకు అమర్చుకుని వర్క్ చేయొచ్చు. దీనికున్న మ్యాగ్నెట్‌తో ఎక్కడైనా ఇట్టే అతికించి లైట్ ఆన్ చేయొచ్చు. ఉదాహరణకు కారు రిపేర్ చేసే క్రమంలో లైట్‌ను కారు బానెట్‌కి అతికించొచ్చు. లో లైట్లో షూట్ చేసే క్రమంలో దీన్ని ట్రైపాడ్‌కి అమర్చుకుని వాడొచ్చు. వర్షాకాలంలోనూ వాడుకునేలా ‘రెయిన్ ఫ్రూఫ్’తో వీటిని తయారుచేశారు. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు గంటలు వెలుగుతాయి. యూఎస్బీ కేబుల్‌తో ఈ లైట్‌ని ఛార్జ్ చేయొచ్చు.
ఎలాంటి డిస్ప్లే ఉండదు. కానీ, మీ ఫోన్ నంబర్ చూడ్డానికి డిజిటల్‌గానే కనిపిస్తుంది. క్షణాల్లో కీచైన్‌కి ఫోన్ నంబర్ని జోడించొచ్చు. ఇంకేముందీ.. కారు, బండి తాళాల్ని కీచైన్‌కి పెట్టేయొచ్చు. ఇంకా రోజువారీ ఆఫీస్ అవసరాలకు వాడే యూఎస్బీ డ్రైవ్ లాంటివి కూడా కీచైన్‌లో పెట్టొచ్చు. సో.. ఎప్పుడైనా అనుకోకుండా కీచైన్ పోగొట్టుకుంటే, దొరికిన వాళ్లు మీకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ నంబర్ గుర్తుతో ఉన్న ట్యాగ్.. ఈ కీచైన్‌లో ప్రధాన ఆకర్షణ.
రోజంతా ఉరుకులు పరుగులు.. ఒకటే పని! తీరిక దొరికితే చాలు.. కునుకు తీసేద్దాం అనుకుంటారు చాలామంది. కానీ, అదంత ఈజీ కాదు. కళ్లేమో స్ట్రెయిన్ అయిపోయి.. మైండేమో బ్లాంక్ అయిపోయి.. అటూ, ఇటూ దొర్లడం తప్ప నిద్రపట్టదు. అలాంటప్పుడే ఈ మాస్క్ వాడాలి. ఇదో సాఫ్ట్ స్లీప్మాస్క్ మాత్రమే కాదు.. బ్లూటూత్ హెడ్‌బ్యాండ్ కూడా. దీన్ని కళ్లకు తగిలించుకుని, నచ్చిన మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. కునుకు తీసేముందు.. కావాలంటే కాల్స్ కూడా మాట్లాడొచ్చు. అందుకు అనువుగా ఐ మాస్క్‌లో హెడ్‌ఫోన్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి చార్జ్ చేస్తే.. రెండు గంటలపాటు పనిచేస్తాయి. బయటి శబ్దాలు వినిపించకుండా ‘నాయిస్ క్యాన్సిలేషన్’ ఉంది. మాస్క్ పైభాగంలో ఏర్పాటుచేసిన బటన్స్‌తో హెడ్‌ఫోన్‌ను కంట్రోల్ చేయొచ్చు. ఫోన్, ల్యాపీ, టాబ్లెట్‌కు పెయిర్ చేసుకుని వాడుకోవచ్చు.
ఇంటిని విశాలంగా కట్టుకోవడం అందరికీ అలవాటై పోయింది. ఫలితంగా ఇంట్లో గదుల సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరైనా వయసు మళ్లినవాళ్లుంటే? వారికేదైనా అవసరమై పిలవాలంటే? ఇదిగో ఈ యాంకర్ వైర్లెస్ డోర్‌బెల్‌ని ప్రయత్నించొచ్చు. దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా సులభం. ఇంట్లో ఎక్కడా ఎలాంటి వైరింగ్ చేయకుండానే దీన్ని వాడుకోవచ్చు. సింపుల్‌గా స్విచ్ బోర్డులోని పవర్ సాకెట్‌కి డోర్‌బెల్‌ని తగిలిస్తే చాలు. 394 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో ఏ మూల నుంచైనా కాలింగ్ బెల్ మోగించొచ్చు. కాలింగ్ బెల్ నొక్కేందుకు ప్రత్యేక స్విచ్ ఉంది. 45 రకాల బెల్ ట్యూన్స్‌ను కాలింగ్ బెల్గా సెట్ చేసుకోవచ్చు. హాస్పిటల్స్, ఆఫీసుల్లోనూ దీన్ని సౌకర్యంగా వాడొచ్చు.