ఇది ప్రపంచీకరణ యుగం. శాటిలైట్ టీవీలు, స్మార్ట్ఫోన్లు మారుమూల ప్రాంతాలకూ చేరుకున్నాయి. ఇవి మనుషులను తమ వశం చేసుకున్నాయి. సామాజికంగా జరుగుతున్న ఈ మార్పుల ఆధారంగా ఆర్.సి. కృష్ణస్వామి రాజు మనుషులు జంతువుల నేపథ్యంతో ‘మేకలబండ’ నవల రచించారు. ఇది చిత్తూరు జిల్లా పుత్తూరు ఈశ్వరాపురం గ్రామానికి పడమటి దిక్కున ఉన్న గోవిందపాదం గుట్ట దగ్గరికి జీవాలను మేపుకోవడానికి వచ్చే పశువుల కాపరుల జీవితం ఇతివృత్తంగా సాగుతుంది. సుందరం, వడివేలు, పెంచల్రాజు, తిరుపాల్… ఆ నలుగురు కాపరులు. వీరి కుటుంబాల మీద కూడా ప్రపంచీకరణ ప్రభావం పడింది. ఈ విషయాన్ని వారి దగ్గరుండే నల్లగొర్రె, కుంటిమేక, మేకపోతు, పొట్టేలు గ్రహించాయి.
ఆధునికత మోజులో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్నారేమో అని ఆ నాలుగూ తమతమ మందల నుంచి విడిపోయి గోవిందపాదం దగ్గర్లోని మేకలబండకు చేరుకుంటాయి. ఓ యోగి మహిమతో మాటలు నేర్చుకుంటాయి. దీంతో వాటిలో కూడా మనిషిలో ఉండే స్వార్థం వాటికి తెలియకుండానే పెరిగి పెద్దదవుతుంది. చివరికి యోగి వాటికి కనువిప్పు కలిగించడం, తమ యజమానుల దగ్గరికి ప్రయాణం కావడం ‘మేకలబండ’ నవలలో తనదైన శైలిలో చిత్రించారు కృష్ణస్వామి రాజు. కాలంతో సంబంధం లేకుండా మనిషిలో గూడుకట్టుకుపోయిన స్వార్థ పరాయణత్వాన్ని వదిలిపెట్టాలని ‘మేకలబండ’లోని జీవాలు సందేశం ఇస్తాయి.
రచన: ఆర్.సి.కృష్ణస్వామి రాజు
పేజీలు: 117; ధర: రూ. 100
ప్రచురణ: మువ్వ చిన రామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్
ప్రతులకు: ఫోన్: 93936 62821
సంపాదకులు: జ్యోతి వలబోజు
పేజీలు: 368;
ధర: రూ. 300
ప్రచురణ: జేవీ పబ్లికేషన్స్
ప్రతులకు: 80963 10140
సంపాదకులు: మాడుగుల రాములు
పేజీలు: 156; ధర: రూ. 200
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 97011 89242
రచన: షామిర్ జానకీదేవి
పేజీలు: 94;
ధర: రూ. 100
ప్రచురణ: వంశీఆర్ట్ థియేటర్స్హైదరాబాద్
ఫోన్: 93946 11037