– దాస రాజమణి, మేడిపల్లి
మీరు తూర్పు దిక్కుకు ద్వారాన్ని కలిగి, తూర్పు-ఈశాన్యం ద్వారం పెట్టుకుంటే.. ఇంటిద్వారం వరకూ రాకుండానే మెట్లు ఆగిపోయేలా వేసుకోండి. ఇంటికి ప్రధానమైన మెట్లు.. తూర్పు దాటకుండా రావాలి. అక్కడ ఖాళీ స్థలం కొంత ఉండాలి అనుకుంటే, మెట్లను ఆగ్నేయంలో ‘యూ’ ఆకారంలో.. దక్షిణం ముఖంగా ఎక్కేలా రెండు ల్యాండింగ్లతో వేసుకోండి. ఇలాంటి నిర్మాణం.. పొడవు తక్కుగా ఉండే ఇండ్లకు అనుకూలంగా ఉంటుంది. పొడవు అనుకూలంగా మారి, స్థలం సర్దుబాటు అవుతుంది. ప్రధానంగా మేడ మీదికి మెట్లు చేరాలి కాబట్టి, పైన వచ్చే ఈశాన్య ద్వారానికి అడ్డుకాకుండా ఉండటం ముఖ్యం. ఇంటి ఈశాన్య ద్వారం దాటిపోయేలా.. ద్వారానికి ఎదురుగా వచ్చేలా మెట్లు వేయవద్దు. ముందుగానే అన్ని లెక్కలూ వేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకోండి.
– అల్లం రాజు, షాద్‌నగర్
పెద్దవాళ్లు ఎందుకూ పనికిరారని మీ ఆలోచన! వాళ్లు బతికే ఉన్నారు కదా! ఇల్లు, సంపద, మీ జీవితం వాళ్లిచ్చిందే కదా! వాళ్లు ఉండగా వేరేవాళ్లతో చేయించాలనే ఆలోచన మీకెందుకొచ్చింది? కొన్ని సమయాల్లో ముహుర్తాలు కుదరనప్పుడు వాళ్ల పేరుమీద మంచి ముహుర్తం దొరకనప్పుడు మాత్రమే మీరు అనుకున్నట్లు చేయొచ్చు. ప్రస్తుతం సంపాదించేవాళ్లు మాత్రమే శంకుస్థాపనలు చేయాలని, రిటైర్డ్ అయిన వారిని పక్కన పెట్టడం భావ్యం కాదు. వాళ్లతో నిర్వహించే పూజల్లో దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారన్న నానుడి ఉంది. మీ అభిప్రాయాలను పక్కనపెట్టి శాస్త్రం, పెద్దలు చెప్పింది విని ఆచరించండి. అమ్మానాన్నల ఆశీర్వాదంతోనే సకల సంపదలూ అందుతాయి. వారితోనే శంకుస్థాపన చేయించండి.
– మర్రి దశరథ్, చేగుంట
విశాలమైన మైదానాలలో కట్టే ఇండ్లను జాగ్రత్తగా నిర్మించాలి. అది స్వయం శక్తి కలిగి ఉండాలి. ఊరిలోని ఇంటికి అప్పటికే కుదిరిన రోడ్లు ఇతర గృహాలు అన్నీ మనకు మార్గదర్శనం చేస్తుంటాయి. కానీ, ఫార్మ్‌హౌస్‌లు, ఒంటరి ఇండ్లను ఇలా పొలాల మధ్యన కట్టాలంటే.. సరైన స్థలం చూసి, ముందు కాంపౌండ్ కట్టుకోవాలి.

ఆ తర్వాత అందులో మంచి ఇల్లు కడితే అది మహాశక్తిని కలిగి ఉంటుంది. తూర్పు-ఉత్తరాల నిర్ధారణతోనే ఆ స్థలానికి మంచి బలాన్ని అందించవచ్చు. కాబట్టి పొలం స్థలం అనేది కాదు. మంచి స్థలం అనేది ఎంపికలోనే ఇమిడి ఉంటుంది. ఏ చోట అనేది నిర్ధారించుకొని అందులో మంచి ప్లాన్‌చేసి.. రోడ్డును ఏర్పాటు చేసుకొని ఇల్లు కట్టుకోండి. ఇల్లు ఏ దిశకు కట్టినా బాగుంటుంది.
– శరత్, ధర్మపురి
దాన్ని అంచుపట్ట అంటారు. ప్రతి గదిలో నాలుగు గోడలకు నాలుగు అంగుళాలు ఎత్తులో స్కటింగ్ టైల్స్ కింద రన్నింగ్ పట్టిని వేయడం వల్ల గోడలు దెబ్బతినవు. ఇంట్లో తడిబట్టతో తుడవటం, కడగటం వల్ల అన్ని గదుల గోడలు నాని నీళ్లు పీల్చుకుంటాయి. దాన్ని అరికట్టడానికి ఈ విధంగా టైల్స్ అతికించి రక్షణగా ఏర్పాటు చేస్తారు.

అది గోడ బయటికి అంచులాగా అంగుళం మందంతో ఉంటుంది. అది అలా బయటికి ఉండటం వల్ల ఎలాంటి దోషం లేదు. అది కూడా వద్దు అని.. కొందరు గోడ లోపలికి కలిసిపోయేలా పెడుతున్నారు. ఇది ఎలా ఉన్నా దానిద్వారా వచ్చే దోషం ఏదీ లేదు. స్కటింగ్ ఎలా వేసుకున్నా ఇబ్బందిలేదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143