– వి. అనిల్, కొత్తగూడెం.
మీది ఉత్తరం రోడ్డు ఉన్న పెద్ద స్థలం. కానీ, పశ్చిమంలో, దక్షిణంలో స్థలం అనేక వంకరలతో ఉన్నది. దక్షిణ-నైరుతి, పశ్చిమ-నైరుతిని సెట్ చేయకుండానే.. స్థలం ఎలా ఉంటే అలా షాపింగ్ కాంప్లెక్స్‌ను కట్టారు. మీరు గమనించారా? దక్షిణంలో మూడు ట్రయాంగిల్ పాకెట్స్ మిగిలిపోయాయి. తద్వారా మీ నిర్మాణానికి నైరుతి భాగం మూడుచోట్ల తెగిపోయింది. అంటే.. ముందుగా స్థలాన్ని తొంబై డిగ్రీలకు (మెట్నకు) సరిచేయలేదు. అది చాలాపెద్ద దోషం. అలాగే, వాయవ్యంలో పెద్ద గేటును పెట్టారు.
అది వెంటనే మూసేయండి. అలాగే దక్షిణ-నైరుతి కోణంగా పెరిగింది. కట్టిన భవనాన్ని దక్షిణ-నైరుతిలో ఒక పాయింట్ పెట్టుకొని సరిచేయాలి. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కాబట్టి.. ఇంక పై అంతస్తులు కట్టకుండా, నిర్మాణాన్ని తొంబై డిగ్రీలకు సరిచేయడానికి కట్టిన భాగాన్ని కొంత తొలగించాలి. అలాగే, ఈశాన్యంలో పెద్ద పోర్టికోను.. భవనానికి అంటకుండా చేయాలి. అన్నీ ముందే ప్లాన్ చేసుకొని, చూపించుకొని సరిచేసుకోండి. మీ నిర్మాణం బాగాలేదు.
– కె. అనిత, మెదక్.
ఎవరు కట్టినా.. అందులో ఉండేది మనుషులే కాబట్టి, తప్పనిసరిగా శాస్త్ర ప్రకారం నిర్మించాల్సిందే! కుటుంబాలు పెద్దవి-చిన్నవి అనేది కాదు. అందులో ఉండేవాళ్లు మనుగడ సాగించాలి కాబట్టి. అన్ని నిర్మాణాలకూ వాస్తు వర్తిస్తుంది. ఎవరు మార్కింగ్ (ముగ్గు పోసినా) ఇచ్చినా.. శాస్త్ర ప్రకారం కట్టాల్సిందే! కొలతలు చిన్నవి, పెద్దవి ఉండొచ్చు. కానీ, వాటిని జాగ్రత్తగా కట్టుకోవచ్చు.
రెండు పడకల గదుల ఇల్లు అయితే.. దక్షిణం-నైరుతిలో, పడమర-వాయవ్యంలో రెండు గదులు కట్టి.. ఆ రెండిటి మధ్య పశ్చిమాన లేదా దక్షిణాన కామన్ టాయిలెట్ ఇవ్వాలి. తూర్పు-ఆగ్నేయంలో కిచెన్ కట్టాలి. ఇంటికి మొత్తం తూర్పు-ఈశాన్యంలో ద్వారం, అలాగే ఉత్తరంలో ద్వారం తప్పకుండా వచ్చేలా చూడండి. స్థలం చిన్నదైనా, పెద్దదైనా.. ముందుగా ప్లాన్ చేసుకొని, ఇంటిని చక్కగా వాస్తుకు కట్టుకోవచ్చు. నిర్ణయించిన కొలతల ప్రకారమే ఇల్లు చక్కగా కట్టుకోండి. స్థలాన్ని బట్టి ఇల్లు చిన్నది రావచ్చు. కానీ, ఎవరైనా వాస్తు పాటించాల్సిందే!
– కె. శ్రీనివాస్, చాడ.
మీరు నేలమీద కొన్న ఇంటికి (విల్లా)ను ఉత్తరంవైపు పెంచినప్పుడు.. ఉత్తరం గోడలో వచ్చే పిల్లర్స్‌ని జాగ్రత్తగా గోడల్లో కలిసిపోయేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఈశాన్యంలో పిల్లర్ హాలులో సపరేటుగా కనిపించకూడదు. దానిని గోడలో కలిసేలా చూడాలి. అలాగే, మీది పడమర ద్వారం కాబట్టి.. కట్టిన ఇంటిని ఉత్తరంవైపు పెంచినప్పుడు ఆ సింహద్వారం పడమర మధ్య నుంచి దక్షిణ నైరుతికి జరుగుతుంది.
అలాగే, పశ్చిమ ఇల్లు కాబట్టి పశ్చిమ వాయవ్యంలో కారు పార్కింగ్ స్థలం పెరిగి పశ్చిమ నైరుతి వైపు ఇల్లు పెరుగుతుంది. అంతేకాకుండా, దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం తగ్గకుండా చూసుకోవాలి. ఇలాంటి అన్ని విషయాలను ముందే మీరు సరిచూసుకొన్నారా? లేదా? ఒకసారి పరీక్షించుకోండి. ఒక్క దిశ.. అదికూడా ఉత్తరం కదా అని మీరు అనుకున్నా.. దాని ప్రకారం అన్నీ అమరి ఉండాలి.
– సి. రామచందర్, కల్వకుర్తి.
తూర్పు-ఉత్తరం కాంపౌండ్ గోడలకు ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవద్దు. అలాచేస్తే.. ఆ విగ్రహాలు పెట్టేచోట కాంపౌండు ఎత్తు పెరుగుతుంది. గోడ మందం అవుతుంది. అది దోషం. ఈశాన్యంలో నీరు ఉండొచ్చు కదా! అని ఫౌంటెయిన్ నిర్మించి, ఈశాన్యం మూలలో ఇలా నీటి ప్రవాహం ఏర్పాటుచేసి విగ్రహాలు పెడతారు. అదికూడా మంచిదికాదు.
అలా ఫౌంటెయిన్తో కూడిన బుద్ధ విగ్రహం నేలమీద ఆగ్నేయం మూలలో పెట్టుకోవచ్చు. లేదా వాయవ్యం దిశలోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. కాంపౌండు గోడలకు అనిచ్చి బుద్ధ విగ్రహం కావాలి అంటే.. పడమర ప్రహరీకి లేదా దక్షిణం ప్రహరీకి పెట్టుకోచ్చు. పడమర-దక్షిణం కాంపౌండు గోడలు మాత్రం ఒకే ఎత్తు ఉండేలా చూసుకోవాలి. అలాగే తూర్పు-ఉత్తరం కాంపౌండ్లు వాటికన్నా తక్కువ ఎత్తు వచ్చేలా జాగ్రత్త పడాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143