– బి. మధులత, కరీంనగర్.
మనం కోరినట్టుగా.. ఇల్లును ఒకేచోట లేదా దూరంగానూ కట్టుకోవచ్చు. సమష్టి గృహం కూడా కట్టుకోవచ్చు. అందుకు అందరు దంపతులూ ఇష్టపడితే.. ఒకేచోట ఎవరి ఇల్లు వారు కట్టుకోవచ్చు. ఒకే ఇంటిలో అందరూ కలిసికూడా ఉండవచ్చు. అంతేకానీ, ఒకే ఇంటిలో అడ్డంగా గోడలు కట్టి, అన్నదమ్ములు పంచుకొని ఎవరి పొయ్యి వాళ్లు పెట్టుకొని ఉండకూడదు. అది చాలా పెద్ద దోషం. శాస్ర్తానికి స్థలం నచ్చినట్టు ఉంటే.. అందులో అన్నదమ్ముల ప్రకారం స్థల విభజన చేసుకొని, ఎవరి ఇండివిజువల్ కాంపౌండ్ వాళ్లు కట్టుకొని, ఎవరి సెప్టిక్ ట్యాంక్ వారే, ఎవరి మెట్లు వాళ్లే పెట్టుకొని ఎవరి ఇల్లు వారు కట్టుకోవాలి. ఒకే ఇల్లు అయితే, మొత్తం ఒకే కిచెన్‌తో కట్టాలి. లేదా ఒకే స్థలంలో ఎవరి ఇల్లు వారు కట్టుకోవాలి.
– కె. మోక్ష, కేపీహెచ్‌బీ కాలనీ.
ఇంటి సింహద్వారంలో, ఇంటి ముందు చెట్టు పడటం, మెట్లకోణం పడటం, ఎదురుగోడల మూలలు పడటం మంచిదికాదు. తప్పకుండా మార్పులు చేయాలి. తూర్పు ద్వారంలో మెట్లకోణం పడితే తప్పకుండా మన సింహద్వారాన్ని మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే, అపార్ట్మెంటు మెట్లు మారే అవకాశం ఉండదు కాబట్టి. ఇంటి ఈశాన్యం గదికి తూర్పు ద్వారం ఉన్నట్లయితే.. ఎదురు మెట్లు కొలతలను బట్టి ద్వారం ఎడమవైపునకు లేదా కుడి వైపునకు జరుపుకోవాలి. అలా ద్వారం గదికి కుడివైపునకు అనగా.. దక్షిణం జరిపితే, ఆ గదికి ఆ ద్వారం ఆగ్నేయం వచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఫరవాలేదు. ఆ గది ఇంటి మొత్తానికి ఈశాన్యంలోనే ఉంటుంది కాబట్టి దోషం ఉండదు.
– వి. సాధన, ఆలేరు.
ఇంటి స్థలం వేరు. ఇంటి నిర్మాణం వేరు. స్థలాలు కొన్నికొన్ని మూలలు పెరిగి ఉంటాయి. అందులో.. ‘ఈశాన్యం మూల పెరిగి ఉంటే మంచిది. ఆ దిక్కు తప్ప ఏదీ పెరగడం మంచిదికాదు’ అనుకుంటారు. కానీ, దక్షిణం రోడ్డులేని దక్షిణ – ఆగ్నేయం పెరగవచ్చు. పడమర రోడ్డు లేని పశ్చిమ – వాయవ్యం పెరగవచ్చు. ఇలా కొన్ని దిశలు పెరిగితే మంచిదే! అయితే, అవి సహజసిద్ధంగా ఉండాలి. కావాలని పెంచడం మంచిదికాదు. ప్రకృతిపరంగా అవి కుదరాలి. ఇల్లు నిర్మాణంలో ఏ మూలా పెరగవద్దు. సమచతుర్భుజంగా లేదా దీర్ఘ చతురస్రంగా నిర్మిస్తే.. ఎన్నో శుభాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణంలో ఈశాన్యం – నైరుతి ఏ మూలలు కూడా పెరగడం, తెంపు చేసి కట్టడం మంచిదికాదు. అన్నీ సమాన భుజాలతో కట్టినప్పుడే.. గృహం పట్టు కలిగి ఉంటుంది.
– కె.ఎల్. రంగారెడ్డి, దుద్దెడ.
మీరు పంపిన ప్లాన్ చూశాను. తూర్పు రోడ్డు ఉంది. కానీ, వాయవ్యం ఇల్లు పెంచి కట్టారు. నేలమీద ఇల్లు కట్టినప్పుడు కాంపౌండు ఆవరణలోకి ఇంటి నుంచి ఏమూలా బయటికి పొడుచుకొని రావద్దు. మూలలు పెరిగితే.. మన మూలాలు కదిలిపోతాయి. ముఖ్యంగా కింద వాయవ్య పడకగది ఉత్తర – వాయవ్యం టాయిలెట్ మందం పెంచి కట్టారు. అలాగే, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉత్తరం బాల్కనీలోకి పైన ఉండే బెడ్రూమ్ కూడా పెరిగింది. అవి రెండూ పెద్ద దోషాలు. వాటిని తొలగించి, ఆ గదిలోనే టాయిలెట్ కట్టండి. కింద, పైన.. ఉత్తరం ఓపెన్ ఉండేలా చూడండి. అలాగే, వాయవ్యంలో మీరు సెప్టిక్ ట్యాంక్‌ను కట్టారు. అదికూడా దోషమే! కాబట్టి, జాగ్రత్తగా ఇంటిని సరిచేయండి. సెప్టిక్ ట్యాంకును ఉత్తరం భాగంలోని స్థలంలో సెంటర్లో వేయండి. ఈ మార్పులు చేయండి.. అన్ని సమస్యలూ తొలగిపోతాయి. శుభం!
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143