– ఎన్ చంద్రకళ, పాలంపేట.
ఎత్తయిన ప్రదేశాలమీద నిర్మాణాలు చేయడం దోషం కాదు. ఇష్టమున్న చోట.. నీరు ఉన్నచోట.. చక్కని ప్రదేశం ఉంటే, తప్పకుండా నివాస భవనాలు నిర్మించుకోవచ్చు. ఎక్కడ గెస్ట్‌హౌజ్ నిర్మించినా.. అదికూడా ఇల్లే! మనం ఉండే గృహమే అవుతుంది. దాని నిర్మాణంలోనూ అన్ని జాగ్రత్తలూ అవసరమే! కొండలమీద, గుట్టలమీద ఇల్లు, గదులు ఏది కట్టినా.. కేవలం దక్షిణం – పడమర మాత్రమేకాదు. అన్ని వైపులా చుట్టూ లోతుగానే ఉంటుంది. మనం ఎంచుకున్న ప్రదేశమే ఎత్తు ప్రదేశం. కాబట్టి అది సాధారణం. అంతెందుకు.. మన ఇల్లు ఉండే అపార్ట్మెంటుకు చుట్టూ లోతే కదా! విషయం అదికాదు. గుట్టమీద కడుతున్నప్పుడు కాంపౌండ్ చాలా బలిష్ఠంగా, ఎత్తుగా ఉండేలా తప్పకుండా ప్లాన్ చేసుకొని, కట్టుకోవాలి. అది ప్రధానం. ఒక సమతల స్థలం చూసుకొని, దానిని దిశలకు స్థిరపరిచి.. మీరు అనుకునే అందమైన గెస్ట్‌హౌజ్ లేదా రెస్ట్‌హౌజ్ ఏదైనా శాస్త్రబద్ధంగా కట్టుకోండి. తూర్పు – ఈశాన్యం గేట్లు వచ్చేలా గుట్టపైకి మార్గం ఏర్పరుచుకోండి. భద్రత కలిగిన ఇంటిని శుభకరంగా నిర్మించుకోండి.
– కె. ఆదినారాయణ, హైదరాబాద్.
కొందరు ఇంట్లో కామన్ టాయిలెట్ లేకుండా.. బెడ్రూములోని టాయిలెట్‌నే రెండు విధాలుగా వాడుతూ ఉంటారు. అది మంచిది కాదు. మాస్టర్ బెడ్రూంకు ఆగ్నేయంలో టాయిలెట్ కట్టి, దానికి బయటినుంచి మరొక డోర్ ఇవ్వడం వల్ల.. ఆ పడక గదికి ఆ ద్వారం విరుద్ధమైన దిశలో వస్తుంది. తద్వారా ప్రధాన పడకగదికి దోషం వస్తుంది. దాని ప్రసిద్ధి కోల్పోతుంది.
ఎంత చిన్న స్థలమైనా.. కామన్ టాయిలెట్ ఉండాలి అనుకున్నప్పుడు దానికోసం స్థలం తప్పకుండా కేటాయించాలి. వాయవ్యం పడక గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వకుండా, దాని దక్షిణంలో బయట టాయిలెట్ కట్టి, దానిని కామన్‌గా వాడవచ్చు. అటు వాయవ్యం గదికి దగ్గరగా ఉంటుంది. హాల్‌కు అనుకూలంగా, కామన్‌గా ఉపయోగపడుతుంది. కామన్ టాయిలెట్‌ను పొత్తు ద్వారాలు లేకుండా.. సపరేటుగా, దక్షిణం – ఆగ్నేయం, వాయవ్యం – పశ్చిమ దిశల్లో చక్కగా ప్లాన్‌చేసి కట్టుకోవచ్చు.
– పి. ఆంజనేయులు, ఆత్మకూరు.
మీది దక్షిణం రోడ్డు స్థలం. మీకు షాపులు, ఇల్లు వేరువేరుగా కావాలి. దక్షిణం వీధి స్థలానికి ఇల్లు ఉండటం, షాపు ఉండటం దోషంకాదు. కట్టొచ్చు. షాపులు ప్రధానంగా మీకు అవసరం అనుకున్నప్పుడు దక్షిణం రోడ్డుకు ఆనుకొని అంటే.. మెట్లు రావడానికి కావాల్సిన స్థలం వదిలి, దక్షిణం భాగం మొత్తం షాపుల కోసం స్థలం తెంపివేయండి. దక్షిణ – ఆగ్నేయంలో గేటు వచ్చేలా.. పది పన్నెండు అడుగులు వదిలి, మిగతా దక్షిణం ఎన్ని షాపులు వస్తే అన్ని విభజించుకొని నిర్మించండి. ఇక షాపుల గోడనుంచి మూడు లేదా కనీసం రెండున్నర అడుగుల స్థలం వదిలి ఇంటిని నిర్మించండి. ఇంటికి మాత్రం చుట్టూ ప్రదక్షిణంగా ఖాళీ వచ్చేలా ప్లాను చేయండి. అంటే.. ఆ విధంగా ముందు పేపర్‌పైన డిజైన్ చేసుకొని ఇల్లు కట్టుకోండి. అప్పుడు షాపులు దక్షిణం వీధికి ముఖం పెట్టి ఉంటాయి. ఇల్లు చక్కగా మిగతా భాగంలో తూర్పు – ఉత్తరం – దక్షిణం ద్వారాలతో నిర్మించుకోండి.
– సీహెచ్ రాజేశం, కొల్లూరు.
మనిషి జీవన వికాసానికి, ఆరోగ్యం, మానసిక వృద్ధికి ఈ వాస్తుశాస్త్రం ఉద్దేశించబడింది. కొందరు కొన్ని పుస్తకాలలో అలా రాసి ఉండవచ్చు. అలాగని అవే సరైనవని అనుకోవద్దు. సరైన గొప్ప శాస్త్రగ్రంథాలు లేవని కాదు. శాస్త్రం అసలు ఉద్దేశం వేరు. రచయితల వ్యక్తిగత అనుభవాలు వేరు. అనుభవం శాస్ర్తానికి ఆపాదించడం వల్ల వచ్చిన చిక్కులు అవన్నీ.
శాస్త్రం నిర్వచనం చాలా విశ్వజనీనంగా ఉంటుంది. అది అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. వాటిని పరిశీలించండి. భూభ్రమణం, సూర్యుని ఆగమనం, దిశల గుణగణాలు అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పొయ్యికి స్థానాలు నిర్ధారించారు. వాటిలో మొదటిది ఆగ్నేయ స్థానం. ఇదే ప్రధానం. తదుపరి సూర్యాస్తమయం దృష్టిలో ఉత్తర – వాయవ్యం కూడా పొయ్యికి స్థలాన్ని నిర్ధారించారు. ఇవి పాటిస్తే చాలు. మీకున్న స్థలాన్ని, ఇంటిని బట్టి నిర్ణయించుకోండి.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678