– ఎం. శారద, కేపీహెచ్‌బీ కాలనీ.
మనం ఇంటి యజమానులం కాకపోయినా.. ప్రధానంగా ఆ ఇల్లు పరిసరాలు, దాని రూపురేఖలు, అక్కడి వాతావరణం అంతా మనమే అనుభవిస్తాం కదా!? ఒక మురికికాలువ వద్ద ఇల్లు ఉండి, ఆ యజమాని మరో ఊరిలో ఉంటే.. ఆ కాలువ చెడు అంతా ఆ ఇంట్లో అద్దెకుండే మనకే కదా చెందుతుంది. యజమానికి కాదుకదా! వాడుకునే వారిమీదే ఆ గృహ ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగని యజమానికి ఉండకపోదు. కానీ, అది అత్యల్పం. కారులో వెళ్లేవారికి ఆ కారు బ్రేకులు, దాని ఏసీ, ఆ కారు స్పీడు, దాని ఫలం.. అందులో ప్రయాణించేవారికే కదా చెందుతుంది. అలాగే కారుకు ఏదైనా సమస్య వస్తే.. అది ఆ యజమాని సరిచేసుకుంటాడు. అలా మనం ఉన్న ఇంటి వాస్తు మనకే అధికం. అన్నీ చూసుకొని ఉండాలి.

– కె. మనోహరి, మర్రిగూడ.
భారతీయుల భౌతికశాస్త్ర విజ్ఞానం మహోన్నతమైనది. కట్టడాలతో అద్భుతాలు చేసి చూపినవారు మన పూర్వికులు. రామాయణ కాలంలోనే లంకానగరం ఏడు – ఎనిమిది అంతస్తుల భవనాలతో అలరారిన చరిత్ర మనది. సూర్యకిరణ శక్తితో ‘విమాన శాస్త్రం’ ఎంతో వృద్ధి చెందింది ఆనాడు. ఔరంగాబాద్‌లో నేటికీ ఆనవాలుగా మిగిలిఉన్న.. జలాశయం నదీ జలాన్ని అంతర్వాహికల ద్వారా పంపింగ్ చేసిన భౌతికశాస్త్ర ప్రజ్ఞ ఎనలేనిది. దానిని ఆధునిక ఇంజినీర్లు కూడా అర్థం చేసుకోలేక పోయారు. ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకోవడానికి ఎవరూ అడ్డు చెప్పరు. ఏదైనా కష్టం వచ్చినప్పుడే.. అందరూ కళ్లు తెరుస్తారు. మన పెద్దలు మనకు ఇచ్చిన శాస్ర్తాలు మన జీవితాల ఉద్ధరణ కోసమే. అంతేకానీ, పరోక్షంగా ఇప్పుడు వాళ్లు పొందేది ఏమీలేదు. ఇది చాలా లోతైన జీవన సాఫల్య శాస్త్రం. ఎవరి ఇష్టాలకూ తలవంచదు.
– ఎం. సుజాత, సైదాబాద్.
ఇంటిచుట్టూ వాస్తు కోసమని ప్రదక్షిణ పూర్వకంగా డ్రైనేజీ కాలువను తిప్పి పంపాల్సిన అవసరంలేదు మీకు. మురికినీరు కాలువ ద్వారా (డ్రైన్ లైన్) సరైన స్లోపు (వాటం) పెట్టే అవకాశం ఉన్నంతవరకూ వీధిలోని చాంబర్‌కు కలపడం చేయాలి. దక్షిణంలోని టాయిలెట్ వాటర్ – పడమర వీధి ఉంటే.. పడమర ద్వారా కాంపౌండు కిందినుంచి పంపవచ్చు. దక్షిణం వీధి ఉంటే దక్షిణం నుంచి నేరుగా డ్రైన్ పైపులోకి కలుపవచ్చు. ఉత్తరం – తూర్పు రోడ్డు ఉన్న ఇండ్లకు ఉత్తరం మధ్య నుంచి, తూర్పు మధ్యనుంచి వీధిలోకి కలపవచ్చు. అనవసరంగా తిప్పడం వల్ల వాటం కుదరక.. ఇంట్లో చాంబర్లు పొంగి, ఎక్కువ నష్టాలు తెస్తాయి.

– ఎం. సుఖేందర్, కోదాడ.
త్రిభుజం స్థలం ఉంది. కానీ, దానికి రోడ్డు ఎటు ఉందో చెప్పలేదు మీరు. దక్షిణం రోడ్డు ఉంటే.. అది నైరుతి పెంచుతూ పోతుంది. ఉత్తరం రోడ్డు ఉంటే.. కొంతవరకూ బాగుంటుంది. ఇలాంటి త్రిభుజాకారంలో రోడ్డును అనుసరించి ఒక దీర్ఘచతురస్రం స్థలం లేదా ఒక చతురస్రం స్థలం కానీ వచ్చేలా ముందుగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. దానిలోకి రోడ్డు నుంచి ఒక గేటు పెట్టుకొని వాడుకోవాలి. అలా చేసినాకూడా.. మిగతా స్థలం కోణాకారంగా మిగిలే ఉంటుంది. ఆ స్థలాన్ని తప్పక వదిలివేయాలి. దానిని కూడా తిరిగి వాడుకోవాలి అనుకోవద్దు. వచ్చిన స్థలంలో ఎంత ఇల్లు వస్తే.. అంత ప్లానుచేసి కట్టుకోవాలి. తప్పక కాంపౌండు కట్టుకున్నాకే.. ఇల్లు మొదలుపెట్టాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678