– కర్నె ధరణి, చౌటుప్పల్
అమ్మ-అత్త, బావ-బావమరిది, అన్న-తమ్ముడు వారివారి ఇండ్లను ఒకే ప్రదేశంలో కట్టుకోవచ్చు. కానీ, ఎవరి ఇల్లు వారికే ప్రత్యేంగా నిర్మించుకోవాలి. ఎలాగూ కలిసి ఒకే ఇంట్లో ఉండలేరు! ఎవరి సొంతిల్లు వారికి ఉండాలి అనుకున్నప్పుడు ఇండ్లు అంటుకొని కానీ, కాంపౌండ్లు లేకుండా కానీ కట్టుకోవద్దు. కారణం ఎవరి పవర్ వాళ్లకు ఉపయోగపడుతుంది.
పల్లెటూర్లలో అయినా, పట్టణాల్లో అయినా ఎవరి మెట్లు, ఎవరి సెప్టిక్ ట్యాంక్ వాళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. నిర్మాణంలో ఆత్మీయతలు అంటుకొని ఉండటం అభివృద్ధికి ఆటంకం. ఒకే స్థలంలో ఎవరి ఇండ్లు వాళ్లు ‘వాస్తు’తో కట్టుకుంటే మంచిది. ఎవరి సొంత జీవితం వారికి ఉండి, ఒకరికి ఒకరు సమీప బలంతో భద్రత కలిగి ఉంటారు. అన్ని తెలుసుకొని మంచి ఇల్లు కట్టుకోండి.
– ఎమ్.సుజాత, జీడికల్
ఇంటికి పశ్చిమ వాయవ్యం కట్ చేసి చాలా ఇండ్లు కడుతున్నారు. అది కూడా ‘అడ్జెస్ట్మెంట్’ కోసమే! నిర్మాణ సూత్రం కాదు. అవసరం-ఆపద్ధర్మం మాత్రమే! ఇదంతా బిల్డర్లు సృష్టించిన విధానం.
ఇంటి నిర్మాణ స్థలం ‘కట్ చేసి’ ఇంటి కింద ఫ్లోరింగ్ ఇవ్వడం వాళ్ల మాయ! ఇక రెండు కార్ల పార్కింగ్ అనేది పశ్చిమ వాయవ్యంలో రావడం వల్ల.. మంచి దిక్కుకు ఎక్కువ స్థలం కట్ చేయాల్సి వస్తుంది. కేవలం పశ్చిమంలో మూడో భాగం మాత్రమే కట్ చేసే అవకాశం ఉంటుంది. అదంతా కొలతలతో చేయించి, పడమర సింహద్వారం తరువాత నైరుతిలో బెడ్రూమ్ సరిగ్గా విభజన చేసి కట్టాలి. లేదంటే యజమానికి దోషం వస్తుంది.
– బి.రాంరెడ్డి, చిట్యాల
దక్షిణం మధ్య, పడమర మధ్య టాయిలెట్లు పెట్టుకోవచ్చు. అయతే విల్లాల్లో దక్షిణం వైపు మెట్లు వేసి ‘పౌడర్ రూమ్’ అనీ, ‘టాయిలెట్’ అనీ నిర్మిస్తున్నారు. ఆ మెట్లు ల్యాండింగ్ కిందికి ఉంటుంది. అంటే ఆ టాయిలెట్ ఎత్తు కనీసం ఐదు ఫీట్లు మించి ఉండదు. ఇలాంటప్పుడు చాలామంది ఆ ల్యాండింగ్ కింద మనిషి నిలబడే విధంగా (దాదాపు ఆరుఫీట్లు ఉండేలా) భూమిని తవ్వి దక్షిణంలో టాయిలెట్ కడుతున్నారు.
ఇది చాలా దోషం. దీనివల్ల ఇంటికి దక్షిణంలో గొయ్యి ఏర్పడుతుంది. దాని తాలూకు దుష్ఫలితాలు ఉంటాయి. ఇదేవిధంగా పడమరలో కూడా పెట్టే అవకాశం ఉంది. ఇలా నిర్మాణం చేయడం జరిగితే ఇంటి ఫ్లోరింగ్ని పెంచాలి. ఆ గొయ్యిని మూసేయాలి. అది చాలా అవసరం.
– భారతి, హైదరాబాద్
తూర్పు సెంటర్లో గేట్లు పెట్టొచ్చు. ఇల్లుకు తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం ఉత్తమమైనవి. తూర్పు సెంటర్లో, ఉత్తరం సెంటర్లో ద్వారాలు, గేట్లు పెట్టకూడదని ఏ శాస్త్రంలోనూ లేదు. ఒకప్పుడు ‘ఛత్రశాల భవంతి’కి అన్ని దిక్కులకూ, ప్రధాన దిశల సెంటర్లలో ద్వారాలు పెట్టడం కనిపించేది. అది ఉత్తమం, అవసరం కూడా! తూర్పు అనగానే సెంటర్ కొలత చేసి సగం భాగం రావాలి అని లెక్కించకూడదు.
తూర్పు విస్తీర్ణం పెద్దది. ఐదు భాగాలుగా ఉంటుంది. అంటే తూర్పు భాగాన్ని తొమ్మిది భాగాలు చేసి ఆగ్నేయం రెండు భాగాలు, ఈశాన్యం రెండు భాగాలు చేసి మధ్యలో ఉన్న ఐదు భాగాలను తూర్పు భాగంగా గుర్తించాలి. ఆ ఐదు భాగాలు దాటి ఆగ్నేయంలో పడకుండా ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు భాగాన్ని దాటకుండా గేటు పెట్టడం ప్రధానం.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143