-మర్రి శశిధర్, నిర్మల్
ఆ దిక్కులు లేని ఇంటికి ఏ దిక్కుగా రోడ్డు ఉండి, ఎటుగా సింహద్వారం పెట్టి వాడుతున్నారు అని ముందుగా ఆలోచించాలి. విదిక్కులు మనిషి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైతే విదిక్కుల స్థలంలో ఇల్లు కట్టుకుంటామో.. ఆ విదిక్కులు పెద్దవిగా మారి వాటి స్థాయిని పెంచుకొంటాయి. మనం సాధారణంగా దక్షిణం రోడ్డు అనుకొని ఇల్లు కడితే అది ‘నైరుతి రోడ్డు’గా ఉంటుంది.
ఆ దిశ గుండా ద్వారం పెట్టినప్పుడు నైరుతి ద్వారం.. ‘నరక ద్వారం’గా మారుతుంది. ఇలాంటి విదిక్కులలో స్థలాలకు ఎదురుగా వచ్చే రోడ్డుపోట్లలో మంచి వాటికన్నా చెడ్డవే అధికంగా ఉంటాయి. అంటే మన ఊహలో దిక్కు కరెక్ట్‌గా ఉంటుంది. కానీ, ప్రాక్టికల్‌గా విరుద్ధంగా ఉండి చాలా వికృతమైన ఫలితాలు ఇస్తాయి. దిక్కులు లేని ఇల్లు కట్టడమే ఇబ్బందికరం. పైగా దానికి వీధిపోట్లు రావడం మరింత ఇరుకున పెడుతుంది. జాగ్రత్తగా చూపించుకొని.. ఆ ఇంట్లో ఉండాలో, ఖాళీ చేయాలో తెలుసుకొని నిర్ణయం తీసుకోండి.
పద్మ, హైదరాబాద్
రెండు వీధులు వచ్చి ఒక విదిక్కు దానితో ప్రధానంగా ఉన్నప్పుడు దానిని బ్లాకు అంటారు. అంటే దక్షిణం రోడ్డు, అలాగే తూర్పు రోడ్డు ఉన్న స్థలానికి మధ్య ప్రధానమైనది ఆగ్నేయం మూల అవుతుంది. అలాంటి స్థలాన్ని ‘ఆగ్నేయం బ్లాకు’ అని పిలుస్తారు. అలా నాలుగు మూలలనూ వాటి వాటి పేర్లతో పిలుస్తారు. ఇవి వ్యక్తి మీద, కుటుంబం మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి అనడం అతిశయోక్తి కాదు. చాలా లోతైన అధ్యయనంతో కానీ వాటి విలువ అర్థం కాదు. ఇక వీటిలో చెడ్డవి, మంచివి అనే వ్యత్యాసం లేదు. ఏవి ఎలా నిర్మిస్తారో, ఆ నిర్మాణ రీతులను బట్టి వాటి వాటి ప్రయోజనాలు లేదా ప్రతికూలతలను నిర్ణయిస్తారు. కూరగాయలు వేటికవి బాగానే ఉంటాయి! వండిన తర్వాతే కదా వాటి ఫలం మనకు అనుభవంలోకి వస్తుంది. ఇవీ అంతే!
– బి.నరసారెడ్డి, వర్ధన్నపేట
క్వారీ విషయంలో ఎటు చూసినా గుట్టలు గుట్టులుగా రాళ్లు (బ్లాకులు) ఉంటాయి. బరువైన- బలమైన పెద్ద పెద్ద వాహనాలు వస్తూపోతూ ఉంటాయి. రాతి పొరలు తొలిచి రతనాల వంటి బండలను వెలికి తీస్తుంటారు. ఈ ప్రాంతంలో సహజంగా మనసు రాటుతేలి ఉంటుంది. కారణం అక్కడి వాతావరణమే! కాబట్టి క్వారీకి దక్షిణంలో అంటే క్వారీ ‘వెల్‌కు’ దక్షిణ-పడమరలో కాస్త దూరంగా అనుకూలమైన, విశాలమైన స్థానం ఎంచుకోవాలి.
దానిని అన్నిరకాలుగా వాస్తుకు కట్టుదిట్టం చేసి ఆఫీసు గది, అట్లాగే స్టాఫ్ గదులు నిర్మించుకోవాలి. ప్రధానంగా ఆహ్లాదం కలిగించే విధంగా వర్కర్స్ గదులు, వంటశాల, టాయ్లెట్లు నిర్మించడం చాలా ముఖ్యం. పని చేయడం వేరు, విశ్రాంతి తీసుకోవడం వేరు. గదులు చాలా ఆహ్లాదంగా ఉండేలా నిర్మించాలి. అప్పుడు శ్రమించేవాళ్లకు శక్తి వస్తుంది. ఫలాలు అధికమవుతాయి.
– ఎం. శ్రీలత, రామునిపట్ల
తూర్పు వీధికి సింహద్వారం చేసి ఇల్లు కట్టారు. అంటే మీ ఇంటికి ‘లిఫ్ట్ భాగం’ తూర్పు మధ్యలో పెట్టి కట్టారు. ఇది సరైన విభజన కాదు. ‘లిఫ్ట్ ప్లేస్’ మన ఇంటిని, తూర్పు భాగాన్ని కత్తిరించే విధంగా రాకూడదు. ఇక్కడ లిఫ్ట్ ఉన్న స్థలం పెద్ద దోషం. పూజ గది స్థానం ఎప్పుడూ తూర్పు తాకుతూ ఉండాలి. అట్లాగే తూర్పు భాగంలోకి రావాలి. తూర్పు ఇంటిలో తూర్పు ఈశాన్యంలో డ్రాయింగ్ రూము, తూర్పు ఆగ్నేయంలో వంటగది విభజన చేశాక.. మిగిలిన తూర్పు భాగంలో అంటే.. తూర్పు సెంటర్లో ఈశాన్యం వైపు పూజగది ఉండాలి. పైగా ఆ గదిని తూర్పు గోడకు వెంటిలేటర్ వచ్చే విధంగా నిర్మించాలి. అప్పుడే పూజగది సూర్యకిరణాల ప్రసరణతో లైవ్‌గా, లైట్‌తో ఉంటుంది. మీరు మీ ఇంటిని నిర్మించేటప్పుడే అన్ని ఆలోచించుకోవాలి కదా! ఇప్పుడు మీ పూజగది, అట్లాగే మీ లిఫ్ట్ స్థానం రెండూ సరైన స్థానాల్లో లేవు. మార్చటం అవసరం. మర్చలేని పక్షంలో ఇల్లు మారాల్సిందే!
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143