– వినోద్‌కుమార్, ఆలేరు.
ఆపద వస్తే భగవంతుణ్ని వేడుకుంటాం. భగవంతుని గుడికి ఆపద కలిగితే అనుమానమా? బాగు చేయడానికి సందేహించడమా? అది ఒక భాగ్యంగా, వరంగా భావించాలి. ఆర్థిక స్థితిగతులు సహకరిస్తే.. తనతోపాటు పదుగురిని కలుపుకొని ‘ఆలయ ఉద్ధరణ’కు పూనుకోవడం గొప్పకార్యం అవుతుంది. జీర్ణ దేవాలయాల ఉద్ధరణను ఒక ఉద్యమంగా చేసే వ్యక్తులు, సంస్థలు కూడా ఉన్నాయి. అయితే, వాటిని తెలిసిన స్థపతుల చేత పరిశీలించి, ఆగమానుసారంగా సరిచేయడం అవసరం.
తెలిసీ తెలియక వైద్యం చేయకూడదు. కొన్ని పురాతన ఆలయాలు ఎంత గొప్పవి, కళారూపాలతో విరాజిల్లినా.. వాటి శక్తిలో మార్పులు జరిగి పక్కకు ఒరిగి పోతుంటాయి. అలాంటి ఆలయాలను చక్కగా పునరుద్ధరించడానికి, వాటికి పూర్ణవైభవం, వాస్తు వైభవం తేవడానికి అవి ఉన్నవి ఉన్నట్టు తిరిగి కట్టడానికి.. నంబరింగ్ చేసి, ఫొటోలు తీసి.. తిరిగి గొప్పగా నిలబెట్టవచ్చు. అయితే ఇదంతా శాస్త్రంతో – ఖర్చుతో – సంకల్పబలంతో జరగాలి. అయితే, బాగుచేసిన వారికి ఎలాంటి దోషం రాదు.
– డి. సాయిరామ్, వెల్దండ.
ఇంటికి పెట్టే ద్వారాలు అన్నీ భాగ్యాన్ని అందించేవే! అది సింహద్వారం అయినా.. పడక గది ద్వారం అయినా! గృహానికి ప్రధాన ద్వారం కానీ, ఇతర ద్వారాలు కానీ ఎక్కడ పెట్టాలి అనేది వాటి స్థానం నిర్ణయిస్తుంది. అలా ఉత్తమత్వం ఏర్పడుతుంది. ఉచ్ఛస్థానం – నీచస్థానం అనేవి ప్రతి గదికీ ఉంటాయి.
కాబట్టి సరైన చోట పెట్టే సాధారణ చెక్క ద్వారానికి అదే భాగ్యం.. బంగారు ద్వారానికీ అదే భాగ్యం! ఉత్తమగుణం స్థానాన్ని బట్టి ఉంటుంది కానీ, దానిని తయారుచేసిన లోహాన్ని బట్టికాదు. ఇకపోతే.. ‘పిరమిడ్’ దిమ్మెలు బిగించినంత మాత్రాన ద్వారానికి అదనపు శక్తి ఏదీరాదు. పిరమిడ్ అనేది ఒక ఆచ్ఛాదనాన్ని ఇచ్చినప్పుడే అది ఫలవంతం అవుతుంది. అంటే దానికింద మన బ్రెయిన్ ఉన్నప్పుడు చైతన్యం చెందుతాం. పిరమిడ్‌ను శక్తిక్షేత్రంగా వాడాలి. అంతేకానీ, బొమ్మలాగా – బొట్టులాగా కాదు. మంచి టేకు ద్వారం ఇంటికి ఉంటే చాలు.
– కె. బిందుమాధవి, బాలానగర్.
సహజంగా ఫ్యాక్టరీలలో ఎన్నో మిశ్రమాలను మండించడానికి ఈ బట్టీ (కొలిమి)లను అనేక పరిమాణాలలో అంటే.. పెద్దగా, లోతుగా, నిరంతరాయంగా మండే విధంగా ఏర్పాటు చేస్తారు. గొయ్యితో కూడి ఉండే బట్టీకి ఆగ్నేయం లేదా వాయవ్యం స్థలం కేటాయించాలి. అయితే గొయ్యి అనివార్యం అయినప్పుడు ఆ ఫ్యాక్టరీ ఈశాన్యంలో ఒక లోతు గుంతను ప్రత్యేకంగా అంతే ‘పరిమాణం’తో తీయాలి.
అందులో నీటిని నింపాలి. తద్వారా అది గొయ్యికి ప్రత్యామ్నాయం కాగలదు. కేవలం నేలమీద అమర్చే చిమ్నీలు అయితే కూడా వాయవ్యం లేదా ఆగ్నేయం స్టోర్‌ను ఆ బట్టీకి పడమర లేదా దక్షిణంలో షెడ్డు వేసుకొని వాడుకోవాలి. ఆ బట్టీకి లేదా చిమ్నీకి చుట్టూ ఒక కంచెవేసి రక్షణ కూడా కల్పించడం మంచిది. తద్వారా అది దానికది దోషరహితంగా ఉంటుంది.
– వీరాంజనేయులు, కొలనుపాక.
ఇంటి పైకప్పులు – ఫ్యాక్టరీల పైకప్పులు, కోళ్ల ఫారాల పైకప్పులు.. అలా ‘వి’ ఆకారంలో వేయడం వల్ల పక్కన ఉండే ఇండ్లు, తదితర నిర్మాణాలకు అవి వెన్నుపోటుగా గుర్తించాలి. అంతేకానీ, ఎలివేషన్స్‌లో ఇంటి సింహద్వారంపైన ఒక ఆకర్షణగా చేసుకునే కోణాన్ని వాస్తు దోషంగా చూడకూడదు.
నిజం కత్తివేరు.. చెక్కకత్తి వేరు కదా!. ఎన్నో ఇండ్లకు ఎదురుగా మెట్లకు వచ్చే పరదా గోడలకు శంఖు – చక్రాలు, ఓంకారం, స్వస్తిక్ గుర్తులు, తదితర దేవతా రూపాలు పెట్టడం సహజం. అవి ఇంటి అలంకరణలో భాగం కానీ, వాటికి ఎట్టి నిర్మాణదోషం ఉండదు. ఒక గోడను ప్రధానంగా చేసుకునే ఈ చిత్రీకరణ దోషం కాదు. కానీ, ఆ గోడ దేనినైనా అడ్డుకుంటుందా? ఏ దిశనైనా మూసివేస్తుందా? అనేది ప్రధానంగా ఎలివేషన్స్‌లో చూడాల్సి ఉంటుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143