కృష్ణా నది తీరంలో జన్మించి జాలరుల జీవితాలను ఆవిష్కరించడంతోపాటు గోదావరి ఒడ్డున ఉన్న సింగరేణి కార్మికుల వెతలను వివరించింది ఈ రచయిత్రి. శారద కావురి వృత్తిరీత్యా టీచర్. సమాజాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి. ‘సావుడప్పు’ కథలో ఒక్కపూట తిండికోసం ఆ మనుషులు పడే వేదనను హృద్యంగా కళ్లకు కట్టింది. ‘ఎవరైనా బాధలో ఉన్నారంటే నా మైండ్ వాళ్ల పక్షాన నిలబడి, ఏ పనిలో ఉన్నా వారిగురించే ఆలోచిస్తుంది’ అని రచయిత తన ముందుమాటలో రాసుకుంది.
ఇందులోని 12 కథల్లో ఎక్కువ భాగం బీద బతుకులకు అద్దం పట్టాయి. దొంగగా మారిన తండ్రి మారుతాడనే క్షమను పంచే ‘క్షమాఛాయ’, మానసిక చలనం లేని ‘అబ్బూ’ను వదిలించుకోవాలనుకునే చిన్నకొడుకు రహీద్, నాన్న కోసం అమెరికాను వదిలిపెట్టిన పెద్దకొడుకు ముజీర్.. జన్మతః బుద్ధులు రావని, వ్యక్తి ఆలోచనల మేరకే వ్యక్తిత్వం ఉంటుందని నిరూపిస్తుందీ కథ. తమ ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు బావుల్లో పనిచేస్తూ, అనారోగ్యం పాలవుతున్న సింగరేణి కార్మికుల వెతలను విభిన్న కోణాల్లో స్పృశించింది రచయిత్రి.
రోగులన్న ఇంటికి పెళ్లి సంబంధాలు రాక సతమతమయ్యే ‘సమ్మయ్య.. మరికొందరు’ కథ ఆలోచింపజేస్తుంది. హక్కుల సాధన కోసం కార్మికులు పోరాడాల్సిందేనని చెబుతుంది. అవటివాడుగా పుట్టిన కొడుకును తండ్రి దూరం పెడితే, తల్లి ప్రాణంగా చూసుకునే ‘ఒక మనోజ్ కథ’ అమ్మదనం గొప్పను చాటుతుంది. ఇలా ఎన్నో సామాజిక అంశాలను జోడిస్తూ జగమంతా తన కుటుంబంగా భావించి, వారి కష్టాలను కథలుగా మలిచి ఈ సంకలనంలో పొందుపరిచింది రచయిత్రి శారద.
రచయిత: శారద కావూరి
పేజీలు: 130, ధర: రూ.150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్ కాచిగూడ, హైదరాబాద్
-రాజు పిల్లనగోయిన
రచన : ఉమ్మడిసింగు రాఘవరావు
పేజీలు : 72;
ధర : రూ.100
ప్రచురణ : మానస ఆర్ట్ థియేటర్స్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 92471 08893
రచన : నేమిలేటి కిట్టన్న
పేజీలు : 75;
ధర : రూ.100
ప్రచురణ : నెమిలేటి రచనలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94901 82636